ఐసీ మూన్స్ : గురు గ్రహం ప్రధాన ఉపగ్రహాలైన క్యాలిస్టో(Callisto), ఐవో(Io), యూరోఫా(Europha), గనిమిడ్(Ganymede) లను గెలీలియో కనుగొన్నారు. ఫలితంగా వీటికి గెలిలీయో గ్రహాలు అని నామకరణం చేశారు. అయితే, ఇవి ఐసీ మూన్స్ కావడంతో వీటి ఉపరితలంపై పరిశోధనలు చేయడానికి ఐరోపా శాస్త్రవేత్తలు ‘The JUICE’ ఉపగ్రహాన్ని సిద్ధం చేశారు. ఈ నాలుగింటి ఆర్బిట్లలో కృత్రిమ ఉపగ్రహం పరిభ్రమించిన అనంతరం.. గనిమిడ్ ఐసీ మూన్‌పై ల్యాండ్ అవుతుంది. అనంతరం దాని ఫలకాలపై పరిశోధనలను ప్రారంభిస్తుంది.(Image : Wikipedia)
భారీగా నీటి వనరులు : మనిషి మనుగడకు నీరు మూలాధారం. అయితే ఈ ఐసీ మూన్స్పై భూమి కన్నా ఎక్కువ శాతంలో నీరు ఉందని సమాచారం. భూమండలంపై ఉన్న సముద్రాలతో పోలిస్తే ఈ ఉపగ్రహాలపై ఉన్న సముద్రాలు చాలా పెద్దవిగా ఉన్నాయట. భూమిపై ఉన్న అతిపెద్ద సముద్రమైన పసిఫిక్ మహా సముద్రం కన్నా 10 రెట్లు లోతు ఉంటాయట. పైగా వాటి అడుగు భాగాన రాతితో కూడిన ఉపరితలం ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఐరోపా పంపిస్తున్న కృత్రిమ ఉపగ్రహం ముఖ్య ఉద్దేశం ఇదే. వాటిపై నీటి ఆనవాళ్లను కనుగొని, వాటి స్థితిగతులపై పరిశోధనలు చేయడానికి ఈ కృత్రిమ ఉపగ్రహం ఉపయోగపడనుంది.
సుదీర్ఘ ప్రయాణం : The JUICE శాటిలైట్ సుదీర్ఘ దూరం ప్రయాణించనుంది. 6.6 బిలియన్ కిలోమీటర్ల దూరం ఉండటంతో భూమిపై నుంచి జ్యూపిటర్ గ్రహం పరిధిలోకి చేరుకోవడానికి దాదాపు 8.5 ఏళ్లు పట్టనుంది. అంటే 2031 జులై నెలలో ఈ కృత్రిమ ఉపగ్రహం బృహస్పతిని చేరుకుంటుంది. క్యాలిస్టో, గనిమిడ్, యూరోఫా ఉపగ్రహాల చుట్టూ 35 పరిభ్రమణాలు చేసి చివరకు 2034లో గనిమిడ్ ఉపగ్రహంపై ల్యాండ్ అవుతుంది.(Image : ADS)
ఈ బృహత్కర ప్రాజెక్టుకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నేతృత్వం వహించింది. ఎయిర్‌బస్ అనే ఎయిరోస్పేస్ కంపెనీ ‘The JUICE’ నిర్మాణ బాధ్యతలను తీసుకుంది. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 1.7 బిలియన్ డాలర్లు వెచ్చించినట్లు తెలుస్తోంది. ఈ ఉపగ్రహంలో అత్యాధునిక పరికరాలను అమర్చారు. అల్ట్రావయెలెట్, ఇన్ఫ్రారెడ్ వంటి అన్ని వేవ్లెంత్లలోనూ ఫొటోలు తీయగలిగే హై రెజల్యూషన్ కెమెరాలు దీనికి అమర్చారు. ఉపగ్రహాలను చాలా దగ్గరి నుంచి పరిశీలించేందుకు ఉపయోగపడే హై రెజల్యూషన్ టెలిస్కోప్, వాటి ఉపరితలాలను 3D మ్యాప్స్‌గా మలిచేందుకు అవసరమై లేజర్ మెజర్మెంట్ వ్యవస్థ, మ్యాగ్నోమీటర్లు, సెన్సార్లు ఉన్నాయి. వీటిని పదిలంగా ఉంచేందుకు ప్రొటెక్టివ్ సిస్టం కూడా ఉంది.(Image: NASA)