వీరిద్దరూ పాక్షికంగా విడిపోవడానికి కారణం ఏంటో కూడా చెప్పాడు ఎలన్ మస్క్. స్పేస్ ఎక్స్ పనులు, టెస్లాకు సంబంధించిన వర్క్ వల్ల తాను ఎక్కువగా టెక్సాస్‌లోనే ఉండిపోవాల్సి రావడం, అటూ ఇటూ తిరగాల్సి రావడం ఎక్కువగా ఉంది. అదే సమయంలో గ్రీమ్స్ తన కెరీర్ పరంగా ఎక్కువగా లాస్ ఏంజిల్స్‌లో ఉంటుందని మస్క్ తెలిపారు. విడిపోవడానికి దాదాపు ఇదే కారణంగా పరోక్షంగా చెప్పారు.
అప్ఘన్ను సొంతం చేసుకున్నతర్వాత తాలిబాన్లు పలు మీటింగ్‌లు పెట్టారు. అందులో ఎవరూ ఎక్కువగా మాస్కులు పెట్టకోలేదు. అయితే ఈ తాలిబన్లు మాస్క్ లేకుండా గదిలో ఓ చోట సమావేశమైన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఎలన్. ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న డెల్టా వేరియంట్ గురించి తెలియదా .. దాని గురించి వినలేదా అని ఎలన్ మస్క్ తాలిబన్లను ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.