Earthquake : ఈ భూమిపై భూకంపం రాని ప్రదేశం అంటూ ఏదీ లేదు. కానీ.. కొన్ని ప్రదేశాల్లో భూకంపాలు చాలా అరుదుగా వస్తుంటాయి. మరికొన్ని చోట్ల తరచూ వస్తూనే ఉంటాయి. భూ ఉపరితలం మందంగా, బలంగా, గట్టిగా ఉన్న చోట భూకంపాలు దాదాపు రావు. సపోజ్ మన తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాలు ప్రత్యేక పీఠభూమిపై ఉన్నాయి. ఈ పీఠభూమి చాలా గట్టిది. సిస్మిక్ తరంగాలు ఇటు వచ్చే ఛాన్స్ తక్కువ. అందువల్ల ఇక్కడ భూకంపాలు వచ్చే అవకాశాలు తక్కువ. కానీ హిమాలయాల వంటి ప్రదేశాల్లో సిస్మిక్ తరంగాలు తరచూ ఉపరితలంవైపు వస్తున్నాయి. అలాంటి అవకాశం ఉన్న దేశాలను తెలుసుకుందాం. (image credit - twitter - @ajplus)
Japan : భూకంపం అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు జపాన్. ఆ దేశం పూర్తిగా సముద్రంపై తేలుతూ ఉంది. ఫలితంగా దాని కింద భూ పలకాల్లో కదలికలు విపరీతంగా ఉన్నాయి. అందువల్ల జపాన్‌లో తరచూ భూకంపాలు, సునామీలు వస్తూనే ఉంటాయి. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4 కంటే తక్కువ ఉంటే.. పెద్దగా సమస్య ఉండదు. జపాన్‌లో సంవత్సరంలో ఒక్కసారైనా రిక్టర్ స్కేల్‌పై 7 తీవ్రతతో భూకంపాలు వస్తుంటాయి. అందుకే ఆ దేశ ప్రభుత్వం ఏటా సెప్టెంబరు 1న విపత్తు నివారణ దినోత్సవం పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. (image credit - twitter - @Jhoanor11)
Indonesia : భూకంపాల విషయంలో ఇండొనేసియా... జపాన్ని మించిపోతోంది. ఈ దేశానికి ఉన్న అతి పెద్ద సమస్య ఏంటంటే.. దీని కింద ఓ భారీ అగ్ని పర్వతం ఉంది. అది రింగ్ ఆఫ్ ఫైర్‌లో భాగంగా ఉంది. అందువల్ల ఇండొనేసియా కింద ఉన్న భూమిలోని పలకాల్లో కదలికలు ఎప్పుడూ ఉంటాయి. ఆ కదలికల నుంచి వచ్చే సిస్మిక్ తరంగాలు తరచూ భూకంపాలను తెస్తున్నాయి. (image credit - twitter - @superbitchwtf)
Philippines : ఫిలిప్పీన్స్ కూడా పూర్తిగా చుట్టూ సముద్రం ఉన్న దేశమే. అందువల్ల ఈ దేశం కింద భూమి విపరీతంగా కదులుతోంది. ఫలితంగా ఈ దేశంలో అగ్ని పర్వత పేలుళ్లు ఎక్కువే. చెప్పాలంటే ఈ భూకంపాలు ఆ దేశాన్ని అభివృద్ధి చెందనివ్వట్లేదు. ఇవి తరచూ సంభవిస్తూ... ప్రకృతి విధ్వంసానికి కారణం అవుతున్నాయి. (image credit - twitter - MichaelSCollura)
Ecuador : భూకంపాలు ఎక్కువగా వచ్చే మరో దేశం.. దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్. ఇక్కడ అగ్నిపర్వతాలు చాలా ఉన్నాయి. భూమి లోపల కదలికలు వచ్చినప్పుడు సిస్మిక్ తరంగాలు.. బయటకు వచ్చేందుకు ఈ అగ్నిపర్వతాల మార్గాన్నే ఎంచుకుంటున్నాయి. ఫలితంగా అగ్ని పర్వతాలకు దగ్గర్లో తరచూ భూకంపాలు వస్తున్నాయి. (image credit - twitter - @Geology_History)
Turkey : భూకంపాలు తరచూ వచ్చే దేశాల సరసన టర్కీ చేరడానికి ప్రత్యేక కారణం ఉంది.. ఈ దేశం ఆఫ్రికా, యూరప్, అరేబియా మధ్యలో ఉంది. ఇక్కడ కూడా పలకాల కదలికలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ భూమి ఖండాలుగా చీలడం వల్ల.. పలకాలు ఇప్పటికీ కదులుతూనే ఉన్నాయి. అందుకే ఇక్కడ తరచూ భారీ భూకంపాలు వస్తున్నాయి.
(image credit - twitter - @ajplus)
Ring of Fire : ఈ భూకంపాలు రావడానికి అసలు కారణంగా రింగ్ ఆఫ్ ఫైర్‌ని చెబుతున్నారు. ఈ రింగ్ ఆఫ్ ఫైర్లోనే అగ్ని పర్వతాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచంలోని 90 శాతం భూకంపాలు దీని దగ్గర్లోనే వస్తున్నాయి. ఇది రివర్స్ U ఆకారంలో ఉంటుంది. ఇది ఆస్ట్రేలియా పైన సముద్రంలో మొదలై.. ఇండొనేసియా, ఫిలిప్పీన్స్, జపాన్, కాలిఫోర్నియా, దక్షిణ అమెరికా పశ్చిమం అంతటా విస్తరించి ఉంది. అందువల్ల ఇక్కడే ఎక్కువ భూకంపాలు వస్తున్నాయి. దీంతోపాటూ.. మన హిమాలయాల కింద ఉన్న పలకాలు కూడా ఎక్కువగా కదులుతూ ఉండటం వల్ల అక్కడ కూడా భూకంపాలు తరచూ వస్తున్నాయి. (image credit - twitter - @thandojo)