ఆఫ్ఘనిస్థాన్లో ఈరోజు ఉదయం సంభవించిన భూకంపం వల్ల భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. 6.1 తీవ్రత ఉన్న ఈ భూకంపం కారణంగా 950 మందికి పైగా మరణించారు. మరో 2వేల మందికి పైగా గాయపడ్డారు. యుఎస్ జియోలాజికల్ సర్వే (యుఎస్జిఎస్) ప్రకారం.. భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్లోని ఖోస్ట్ నగరానికి 40 కిమీ దూరంలో ఉంది.