Turkey Earthquake: 8వేలకు చేరిన టర్కీ, సిరియా భూకంప మృతుల సంఖ్య ..వైద్య సేవలందిస్తున్న ఇండియన్ ఆర్మీ
Turkey Earthquake: 8వేలకు చేరిన టర్కీ, సిరియా భూకంప మృతుల సంఖ్య ..వైద్య సేవలందిస్తున్న ఇండియన్ ఆర్మీ
Turkey Earthquake: టర్కీ, సిరియాలో సంభవించిన వరుస భూకంపాల్లో మృతుల సంఖ్య 8వేలకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. శిథిలాల కింద పడి గాయపడిన వారి సంఖ్య కూడా పాతిక వేలు దాటినట్లుగా అక్కడి మీడియా తెలిపింది. ఇక భూకంప బాధితులకు వైద్య సేవలందించేందుకు భారత ఆర్మీ రంగంలోకి దిగింది.
టర్కీ, సిరియాలో సంభవించిన వరుస భూకంపాల ధాటికి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య గంట గంటకు పెరుగుతోంది. తాజా అందించిన లెక్కల ప్రకారం మృతుల సంఖ్య 8వేలకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. (Photo:Twitter)
2/ 13
ప్రపంచంలో సంభవించిన అత్యంత భారీ భూకంపాలుగా వీటిని అక్కడి ప్రభుత్వం చూస్తోంది. కన్నీటి రోదనతో పాటు మరణమృదంగం ఇంకా కొనసాగుతూనే ఉంది. కూలిన భవన శిథిలాల కింద ఇంకా వేలాది మంది ఉంటారని అంచానా వేస్తున్నారు. (Photo:Twitter)
3/ 13
టర్కీ, సిరియాలో వరుసగా మూడు సార్లు భూమి కంపించడంతో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఒక్క టర్కీలోనే ఐదు వేల మంది చనిపోయినట్లుగా అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. మరో 20వేల మందికిపైగా గాయపడ్డట్లుగా తెలుస్తోంది. (Photo:Twitter)
4/ 13
సిరియాలో సైతం రెండు వేల మందికిపైగా చనిపోయి ఉంటారని ..క్షతగాత్రుల సంఖ్య కూడా ఐదు వేల మందికిపైగా ఉండవచ్చని అక్కడి మీడియా,అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ రెండు దేశాల్లో కలిపి ఇప్పటి వరకు7.800మంది చనిపోగా..బుధవారం నాటికి ఆ సంఖ్య 8వేలకు చేరుతుందంటున్నారు. (Photo:Twitter)
5/ 13
ఇక సిరియా, టర్కీలో సంభవించిన భూకంపాలకు 11వేలకు పైగా భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. దాదాపు 25వేల మంది ఎమర్జెన్సీ వర్కర్లు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. రెస్క్యూ ఆపరేషన్లు జోరుగా సాగుతున్నాయి.
6/ 13
గాయపడ్డవారిని తరలించేందుకు 10 నౌకలు, 54 విమానాలు రంగంలోకి దిగాయి. శిథిలాల కింద వేల సంఖ్యలో ప్రజలు చిక్కుకున్నట్లు స్థానిక మీడియా అంచనా వేస్తోంది. దీంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకావం ఉన్నట్లు తెలిపింది.(Photo:Twitter)
7/ 13
మరోవైపు టర్కీ, సిరియాలో ప్రకృతి ప్రకోపంతో ఏర్పడిన బీభత్స పరిస్థితులతో అక్కడి ప్రజలకు సాయం చేసేందుకు భారత ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుంది. ఇప్పటికే అక్కడికి ఇండియన్ ఆర్మీకి చెందిన 89మంది మెడికల్ సిబ్బందిని పంపింది. (Photo:Twitter)
8/ 13
భారత్ నుంచి వెళ్లిన మెడికల్ ఎమర్జెన్సీ, మరియు క్రిటికల్ కేర్ స్పెషల్ టీమ్‌లో ఆర్ధోపెడిక్ సర్జన్స్, జనరల్ మెడికల్ సర్జన్స్‌ను సహాయక చర్యలు అందించేందుకు ప్రత్యేక ఆర్మీ విమానంలో టర్కీ, సిరియా చేరుకున్నారు. (Photo:Twitter)
9/ 13
భూకంప బాధితులకు, శిథిలాల కింద పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వారికి వైద్య సేవలతో పాటు అవసరమైన మెడికల్ హెల్ప్ అందించే పనిలో నిమగ్నమయ్యారు. ఆగ్రాకు చెందిన ఆర్మీ హాస్పిటల్ సైన్యం ఇప్పటికే భూకంపం విధ్వంసం సృష్టించిన టర్కీకి చేరుకుంది. (Photo:Twitter)
10/ 13
టర్కీ చేరుకున్న భారత్ మెడికల్ ఆర్మీ సిబ్బంది అక్కడి ప్రజలకు అవసరమైన ఎక్స్‌రే ఎక్వీప్మెంట్, వెంటిలేటర్స్, ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్, గుండె పనితీరును పరిశీలించే పరికరాలను యుద్ధ విమానంలో వెంట తీసుకెళ్లడం జరిగింది.(Photo:Twitter)
11/ 13
30పడకల సామర్ధ్యం కలిగినట్లుగా అత్యవసర మెడికల్ సర్వీసులు అందించే విధంగా ప్రత్యేక టీమ్ సేవలందిస్తున్నారు. అవసరమైన మేరకు ఎన్డీఆర్ఎఫ్, బృందాలు అత్యవసర సేవలందించాలని భారత ప్రధాని మోదీ ఆదేశించడంతో సహాయకచర్యలు వేగవంతంగా కొనసాగుతున్నాయి. (Photo:Twitter)
12/ 13
ఓవైపు ప్రకృతి ప్రళయం విరుచుకుపడటంతో టర్కీ, సిరియాలో దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. శిథిలాల కింద గుట్టలు గుట్టలుగా జనం చిక్కుకుపోవడంతో వారిని బయటకు తీసే ప్రయత్నం జరుగుతూనే ఉంది. (Photo:Twitter)
13/ 13
మరోవైపు సహాయచర్యలు కొనసాగుతూ ఉండగానే వరుస భూకంపాలు భయపెడుతున్నాయి. కనీసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడానికి కూడా అవకాశం లేనంత దుర్భరంగా పరిస్థితులు తయారయ్యాయి. (Photo:Twitter)