ఇండియాలో కొత్తగా 13,203 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,06,67,736కి చేరింది. 131 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 1,53,470కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.4 శాతంగా ఉంది. కొత్తగా 13,298 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 1,03,30,084కి చేరింది. ప్రస్తుతం రికవరీ రేటు దేశంలో 96.8 శాతం ఉంది. యాక్టివ్ కేసులు 1,84,182గా ఉన్నాయి. కొత్తగా 5,70,246 టెస్టులు మాత్రమే జరిగాయి. మొత్తం టెస్టుల సంఖ్య 19,23,37,117కి చేరింది. (image credit - twitter - reuters)