ఇండియాలో కొత్తగా 16,577 కరోనా కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 1,10,63,491కి చేరింది. కొత్తగా 120 మంది చనిపోయారు. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,56,825కు చేరింది. కొత్తగా 12,179 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 1,07,50,680 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,55,986 యాక్టివ్ కేసులున్నాయి. కొత్తగా దేశంలో 8,31,807 కరోనా టెస్టులు చేశారు. మొత్తం టెస్టుల సంఖ్య 21,46,61,465కి చేరింది. దేశంలో శుక్రవారం ఉదయం వరకు 1,34,72,643 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. మార్చి 1 నుంచి 60 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. (image credit - twitter - reuters)