ఇండియాలో కొత్తగా 43,903 మంది రికవరీ అయ్యారు. మొత్తం రికవరీల సంఖ్య 3,21,81,995కి చేరింది. రికవరీ రేటు 97.4 శాతంగా ఉంది. ప్రస్తుతం భారత్లో 4,04,874 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 14,10,649 టెస్టులు చేశారు. భారత్లో ఇప్పటివరకు 53 కోట్ల 14 లక్షల 68 వేల 867 టెస్టులు చేశారు. కొత్తగా 25,23,089 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 68 కోట్ల 75 లక్షల 41 వేల 762 వ్యాక్సిన్లు వేశారు. (image credit - twitter)
AP Covid: ఏపీలో తాజాగా 43,594 టెస్టులు చెయ్యగా... కొత్తగా 739 పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 20,22,064కి చేరింది. కొత్తగా 14 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 13,925కి చేరింది. కొత్తగా 1,333 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 19,93,589కి చేరింది. ప్రస్తుతం 14,550 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,69,82,681 టెస్టులు జరిగాయి. (image credit - twitter)
Telangana Covid: తెలంగాణలో కొత్తగా 301 పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 6,59,844కి చేరింది. కొత్తగా 339 మంది రికవరీ అయ్యారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 6,50,114కి చేరింది. కొత్తగా ఇద్దరు చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 3,886కి చేరింది. మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. రికవరీ రేటు 98.57 శాతంగా ఉంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 5,505 ఉన్నాయి. (image credit - twitter)
World Covid: ప్రపంచదేశాల్లో కొత్తగా 3,90,807 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 22.19 కోట్లు దాటింది. కొత్తగా 6,424 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 45.88 లక్షలు దాటింది. కొత్తగా 4,84,023 మంది రికవరీ అవ్వడంతో... మొత్తం రికవరీల సంఖ్య 19,85,38,118కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.88 కోట్లు ఉన్నాయి. (image credit - twitter - reuters)
నిన్న ఎక్కువ కేసులు బ్రిటన్ (41,192)లో వచ్చాయి. ఆ తర్వాత అమెరికాలో 36,344 వచ్చాయి. నెక్ట్స్ ఇండియా, ఇరాన్ (27,579), ఫిలిప్పీన్స్ (22,415)లో వచ్చాయి. మరణాలు చూస్తే... నిన్న ఎక్కువ మరణాలు రష్యా (790)లో వచ్చాయి. ఆ తర్వాత ఇండొనేసియా (612), ఇరాన్ (583), వియత్నాం (311), ఇండియాలో వచ్చాయి. (image credit - twitter - reuters)