ఇండియాలో థర్డ్ వేవ్ వస్తుందా రాదా... వస్తే ఎప్పుడు వస్తుంది... ఏ స్థాయిలో వస్తుంది... పిల్లలకు కరోనా సోకుతుందా... ఇలా ఎన్నో ప్రశ్నలున్నా... వాటికి కచ్చితమైన సమాధానాలు లేవు. అన్నీ అంచనాలే. ఐతే... ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్నది డెల్టా వేరియంట్. దాని కంటే 60 శాతం ఎక్కువ శక్తిమంతంగా ఉన్న డెల్టా ప్లస్ వేరియంట్... ఇండియాలో విజృంభిస్తుందేమో అనే డౌట్ ఉంది. ఎందుకంటే... ఈ వేరియంట్... అంత ఈజీగా వ్యాక్సిన్కి లొంగట్లేదని నిపుణులు అంటున్నారు. ఇది రెండు డోసులు వేసుకున్న వారికి కూడా ఈజీగా సోకుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో 3 రకాల వేరియంట్లు బాగా సోకుతున్నాయి. వాటిలో డెల్టా ప్లస్ ఒకటి. ఇప్పటివరకూ అక్కడ 76 మందికి ఇది సోకింది. వారిలో ఐదుగురు చనిపోయారు. 76 మందిలో 10 మంది రెండు డోసులు తీసుకున్నవారే. చనిపోయిన ఐదుగురిలో ఇద్దరు రెండు డోసులు తీసుకున్నా... ఈ వైరస్ వాళ్లను చంపేసింది. అందువల్ల డెల్టా ప్లస్ వేరియంట్ విజృంభిస్తే ఇండియాకి ప్రమాదమే అంటున్నారు నిపుణులు. (image credit - twitter - reuters)
AP Covid: ఏపీలో కొత్తగా 59,198 టెస్టులు చెయ్యగా... కొత్తగా 1,063 పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 19,95,669కి చేరింది. కొత్తగా 11 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 13,671కి చేరింది. కొత్తగా 1,929 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 19,65,657కి చేరింది. ప్రస్తుతం 16,341 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,57,67,609 టెస్టులు జరిగాయి. (image credit - twitter)
Telangana Covid: తెలంగాణలో కొత్తగా 417 కేసులొచ్చాయి. మొత్తం కేసులు 6,53,202కి చేరాయి. కొత్తగా 569 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 6,42,416కి చేరింది. రికవరీ రేటు 98.34 శాతంగా ఉంది. రాష్ట్రంలో కొత్తగా ఇద్దరు మరణించారు. మొత్తం మరణాలు 3,847కి చేరాయి. మరణాల రేటు 0.58 శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,939 యాక్టివ్ కేసులున్నాయి. (image credit - twitter)
World Covid: ప్రపంచదేశాల్లో నిన్న కొత్తగా 6,33,319 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 20.93 కోట్లు దాటింది. కొత్తగా 9,721 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 43.93 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.73 కోట్లు ఉన్నాయి. ఇవి మళ్లీ పెరిగాయి. అమెరికాలో కొత్తగా 1,29,384 కేసులు, 854 మరణాలు వచ్చాయి. బ్రెజిల్లో నిన్న 37,197 కొత్త కేసులు, 1,017 మరణాలు సంభవించాయి. (image credit - twitter - reuters)