Corona updates: ఇండియాలో ఈ నెలలోనే థర్డ్ వేవ్ వస్తుందని నిపుణులు అంచనా వేశారు. మరి అందుకు రాష్ట్రాలు సంసిద్ధంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రధానంగా మహారాష్ట్రలో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. ఈమధ్య ఇవి 66 బయటపడ్డాయి. ముంబైలో తొలి డెల్టా ప్లస్ కేసు మరణం శుక్రవారం జరిగింది. ఆ తర్వాత మరో నలుగురు చనిపోయారు. ఆల్రెడీ డెల్టా వేరియంట్ జోరు అలాగే ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. 132 దేశాల్లో డెల్టా వేరియంట్ విజృంభిస్తోంది. తాజాగా చైనాలోనూ అది ప్రవేశించింది. నిన్న అక్కడ కొత్తగా 66 కేసులొచ్చాయి. దాంతో అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. (image credit - twitter - reuters)
కేరళలో కొత్త కరోనా వేరియంట్ బయటపడింది. కేరళలోని 9 జిల్లాల్లో అది కనిపించింది. దాని వల్లే అక్కడ రోజూ 20వేల కొత్త కేసులు వస్తున్నాయనే వాదన ఉంది. అది ఎలాంటిది, ఎలా సోకుతుంది, ఎంత వేగంగా సోకుతుంది, చంపుతుందా, వ్యాక్సిన్‌ని ఎదిరిస్తుందా... ఇలాంటి విషయాలు తేలాల్సి ఉంది. అందుకోసం శాంపిల్స్‌ని జినోమిక్స్ కన్సార్టియానికి పంపాలని కేంద్రం ఆదేశించింది. ఓ అంచనా ప్రకారం ఈ కొత్త వేరియంట్ వ్యాక్సిన్‌కి దొరకట్లేదు. కేరళలో వ్యాక్సిన్ వేయించుకున్నవారిలో 40 వేల మందికి పైగా కరోనా బారినపడ్డారు. అందుకు కారణం ఈ కొత్త వేరియంటేనా అన్నది తేలాల్సి ఉంది. దీనికి ఇంకా పేరు పెట్టలేదు. (image credit - twitter - reuters)
పిల్లల విషయంలో పేరెంట్స్ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎందుకంటే వారికి వ్యాక్సిన్ లేదు కాబట్టి... వారికి కరోనా సోకే ప్రమాదం ఎక్కువ. ఐతే... అమెరికా, నార్వేలో జరిపిన పరిశోధనల్లో మరో విషయం చెప్పారు. కాలం గడిచేకొద్దీ... సాధారణ జలుబు లాగే... కరోనా కూడా మారిపోతుందనీ... అందువల్ల అది పిల్లలకు సోకినా ఏం కాదని అంటున్నారు. ప్రస్తుతానికి మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. (image credit - twitter - reuters)
AP Covid: ఏపీలో కొత్తగా 69,088 టెస్టులు చెయ్యగా... కొత్తగా 1,535 పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 19,92,191కి చేరింది. కొత్తగా 16 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 13,631కి చేరింది. కొత్తగా 2,075 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 19,60,350కి చేరింది. ప్రస్తుతం 18,210 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,55,95,949 టెస్టులు జరిగాయి. (image credit - twitter)
Telangana Covid: తెలంగాణలో కొత్తగా 420 కేసులొచ్చాయి. మొత్తం కేసులు 6,52,135కి చేరాయి. కొత్తగా 623 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 6,40,688కి చేరింది. రికవరీ రేటు 98.24 శాతంగా ఉంది. రాష్ట్రంలో కొత్తగా ముగ్గురు మరణించారు. మొత్తం మరణాలు 3,841కి చేరాయి. మరణాల రేటు 0.58 శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 7,606 యాక్టివ్ కేసులున్నాయి. (image credit - twitter)
World Covid: ప్రపంచదేశాల్లో నిన్న కొత్తగా 5,62,612 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 20.74 కోట్లు దాటింది. కొత్తగా 8,592 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 43.66 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.71 కోట్లు ఉన్నాయి. ఇవి మెల్లగా పెరుగుతున్నాయి. అమెరికాలో కొత్తగా 70,722 కేసులు, 257 మరణాలు వచ్చాయి. బ్రెజిల్లో నిన్న 31,142 కొత్త కేసులు, 919 మరణాలు సంభవించాయి. (image credit - twitter - reuters)