కంటికి కనిపించని కరోనా... ఎలాగైనా బతకాలని ఎత్తుగడలు వేస్తోంది. ఎన్ని వ్యాక్సిన్లు వచ్చినా... మానవాళిని వదలట్లేదు. సంపన్నదేశం అమెరికాలో మళ్లీ కరోనా కేసులు రోజూ లక్షకు పైగా వస్తున్నాయి. వీకెండ్లో అక్కడ టెస్టులు సరిగా చేయకపోవడం వల్ల శని, ఆదివారం మాత్రమే కేసులు తక్కువగా వస్తున్నాయి. మిగతా రోజుల్లో వైరస్ జోరు చాలా ఎక్కువగా ఉంది. ఇక ఇరాన్, ఇండొనేసియా, బ్రెజిల్, రష్యా, వియత్నాం, బ్రిటన్, జపాన్, అర్జెంటినా దేశాల్లోనూ వైరస్ వ్యాప్తి, మరణాలు ఎక్కువగానే నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఇండొనేసియాలో నెల నుంచి మరణాలు మిగతా దేశాల కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇండియాలో కేంద్రం లెక్కల ప్రకారం కరోనా వ్యాప్తి తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. (image credit - twitter - reuters)
ఇండియాలో కొత్తగా 44,157 మంది రికవరీ అయ్యారు. మొత్తం రికవరీల సంఖ్య 3,16,80,626కి చేరింది. రికవరీ రేటు 97.6 శాతంగా ఉంది. ప్రస్తుతం భారత్లో 3,33,924 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 12,95,160 టెస్టులు చేశారు. భారత్లో ఇప్పటివరకు 50 కోట్ల 75 లక్షల 51 వేల 399 టెస్టులు చేశారు. కొత్తగా 7,95,543 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 58 కోట్ల 25 లక్షల 49 వేల 595 వ్యాక్సిన్లు వేశారు. (image credit - twitter - reuters)
AP Covid: ఏపీలో కొత్తగా 47,972 టెస్టులు చెయ్యగా... కొత్తగా 1,002 పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 20,03,342కి చేరింది. కొత్తగా 12 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 13,735కి చేరింది. కొత్తగా 1,508 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 19,75,448కి చేరింది. ప్రస్తుతం 14,159 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,61,39,934 టెస్టులు జరిగాయి. (image credit - twitter)
Telangana Covid: తెలంగాణలో కొత్తగా 354 కేసులొచ్చాయి. మొత్తం కేసులు 6,55,343కి చేరాయి. కొత్తగా 427 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 6,45,174కి చేరింది. రికవరీ రేటు 98.44 శాతంగా ఉంది. రాష్ట్రంలో కొత్తగా ముగ్గురు మరణించారు. మొత్తం మరణాలు 3,861కి చేరాయి. మరణాల రేటు 0.58 శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,308 యాక్టివ్ కేసులున్నాయి. (image credit - twitter)
World Covid: ప్రపంచదేశాల్లో కొత్తగా 4,70,574 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 21.31 కోట్లు దాటింది. కొత్తగా 7,089 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 44.51 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.79 కోట్లు ఉన్నాయి. అమెరికాలో కొత్తగా 78,736 కేసులు, 346 మరణాలు వచ్చాయి. బ్రెజిల్లో నిన్న 13,103 కొత్త కేసులు, 274 మరణాలు సంభవించాయి. (image credit - twitter - reuters)
నిన్న రోజువారీ ఎక్కువ కేసులు అమెరికాలో వచ్చాయి. ఆ తర్వాత ఇరాన్ (38,657)లో వచ్చాయి. ఆ తర్వాత బ్రిటన్ (31,914), జపాన్ (22,285), రష్యా (19,454) వచ్చాయి. నిన్న రోజువారీ మరణాలు ఇండొనేసియా (842)లో ఎక్కువగా రాగా... ఆ తర్వాత రష్యా (776), ఇరాన్ (610), వియత్నాం (389), అమెరికాలో వచ్చాయి. (image credit - twitter - reuters)