మొదటి డోసే అందక చాలా మంది ఇబ్బంది పడుతున్న రోజులు ఇవి. ఇలాంటి సమయంలో... పరిశోధకులు... కరోనా కంట్రోల్ అవ్వాలంటే... మూడో డోస్ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందే అంటున్నారు. అప్పుడు మాత్రమే కరోనా ఆగుతుంది అంటున్నారు. ప్రస్తుత అంచనాలు చూస్తే... ప్రపంచవ్యాప్తంగా 2 డోసులు వేసుకున్న వారికి కూడా కరోనా సోకుతోంది. మరణాల్లో కూడా 2 డోసులు వేసుకున్న వారు ఉంటున్నారు. కాబట్టి... మూడో డోస్ తప్పదు అంటున్నారు. వారి వాదనకు మరో కారణం కూడా ఉంది. 2 డోసులు వేసుకున్న తర్వాత... కరోనా వైరస్ తనలో జన్యుమార్పులు చేసుకునే ఛాన్స్ ఉందనీ... వ్యాక్సిన్‌ను తట్టుకునేలా కొత్త వేరియంట్లుగా మారే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. అలాంటి వైరస్‌ను ఎదుర్కోవాలంటే... బాడీలో ఎక్కువ యాంటీబాడీలు ఉండాలని అంటున్నారు. అందుకోసం మూడో డోస్ వేసుకోవాలి అని సూచిస్తున్నారు. ప్రస్తుతం డెల్టా వేరియంట్ ప్రపంచ దేశాల్ని కుదిపేస్తోంది. ఇండియా సహా 150కి పైగా దేశాల్లో ఇది విస్తరించి ఉంది. అన్ని దేశాల్లోనూ తీవ్రంగానే ఉంది. దీన్ని వ్యాక్సిన్లు కొద్దిగా ఆపగలుగుతున్నా... పూర్తిగా ఆపలేకపోతున్నాయి. పైగా 2 డోసులు వేసుకున్న వారికి సైతం యాంటీబాడీలు కొంతకాలం తర్వాత తగ్గిపోతున్నాయట. అందుకే మూడో డోస్ పడాలి అంటున్నారు. (image credit - twitter - reuters)
మొదటి వేవ్‌లో కరోనాను బలంగా ఎదుర్కొన్న చైనాకి... డెల్టా వేరియంట్ సవాలుగా మారింది. ఎంతగా ప్రయత్నిస్తున్నా అది ఆ దేశాన్ని వదలట్లేదు. ప్రస్తుతం అక్కడి 31 ప్రావిన్సుల్లో 1200కి పైగా డెల్టా కేసులు వచ్చాయి. దాంతో డ్రాగన్ దేశానికి పిచ్చి కోపం వస్తోంది. ఈ వేరియంట్ అంతు చూడకపోతే... కొంప ముంచేలా ఉందని భావించిన బీజింగ్ పాలకులు... మరింత బలంగా కట్టడి చర్యలు చేపడుతున్నారు. నిజానికి మిగతా దేశాలతో పోల్చితే... డెల్టాను చైనా బలంగానే ఎదుర్కొంటోంది అనుకోవచ్చు. దాదాపు నెల రోజుల్లో 1200 కేసులు రావడం అనేది పెద్ద విషయమేమీ కాదు. ఇండియాలో రోజూ 30వేల కేసులు వస్తున్నాయి. ఇండియాతో పోల్చితే... చైనాలో డెల్టా వైరస్ చాలా తక్కువగానే ఉంది అనుకోవచ్చు. ఐతే... ఏ దేశానికాదేశం డెల్టాను ఎదుర్కొనేందుకు మాగ్జిమం ప్రయత్నిస్తున్నాయి. (image credit - twitter - reuters)
ఇండియాలో కొత్తగా 39,486 మంది రికవరీ అయ్యారు. మొత్తం రికవరీల సంఖ్య 3,17,20,112కి చేరింది. రికవరీ రేటు 97.7 శాతానికి పెరిగింది. ప్రస్తుతం భారత్‌లో 3,19,551 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 16,47,526 టెస్టులు చేశారు. భారత్‌లో ఇప్పటివరకు 50 కోట్ల 93 లక్షల 91 వేల 792 టెస్టులు చేశారు. కొత్తగా 63,85,298 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 58 కోట్ల 89 లక్షల 97 వేల 805 వ్యాక్సిన్లు వేశారు. (image credit - twitter - reuters)
AP Covid: ఏపీలో కొత్తగా 58,890 టెస్టులు చెయ్యగా... కొత్తగా 1,248 పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 20,04,590కి చేరింది. కొత్తగా 15 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 13,750కి చేరింది. కొత్తగా 1,715 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 19,77,163కి చేరింది. ప్రస్తుతం 13,677 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,61,98,824 టెస్టులు జరిగాయి. (image credit - twitter)
Telangana Covid: తెలంగాణలో కొత్తగా 389 కేసులొచ్చాయి. మొత్తం కేసులు 6,55,732కి చేరాయి. కొత్తగా 420 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 6,45,594కి చేరింది. రికవరీ రేటు 98.45 శాతంగా ఉంది. రాష్ట్రంలో కొత్తగా ఒకరు మరణించారు. మొత్తం మరణాలు 3,862కి చేరాయి. మరణాల రేటు 0.58 శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,276 యాక్టివ్ కేసులున్నాయి. (image credit - twitter)
World Covid: ప్రపంచదేశాల్లో కొత్తగా 6,31,920 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 21.39 కోట్లు దాటింది. కొత్తగా 9,973 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 44.63 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.80 కోట్లు ఉన్నాయి. ఇవి మళ్లీ పెరిగాయి. అమెరికాలో కొత్తగా 1,35,388 కేసులు, 1,045 మరణాలు వచ్చాయి. బ్రెజిల్లో నిన్న 30,872 కొత్త కేసులు, 798 మరణాలు సంభవించాయి. (image credit - twitter - reuters)
నిన్న రోజువారీ ఎక్కువ కేసులు అమెరికాలో వచ్చాయి. ఆ తర్వాత ఇండియా, ఇరాన్ (40,623)లో వచ్చాయి. ఆ తర్వాత బ్రెజిల్, బ్రిటన్ (30,872)లో వచ్చాయి. నిన్న రోజువారీ ఎక్కువ మరణాలు అమెరికాలో వచ్చాయి. ఆ తర్వాత ఇండొనేసియా (1,038)లో ఎక్కువగా రాగా... బ్రెజిల్, రష్యా (794), ఇండియాలో వచ్చాయి. (image credit - twitter - reuters)