బోధనా సిబ్బంది విద్యార్థులకు ఇచ్చే గడువుల్లో అనువుగా ఉండి, ఉన్నత ర్యాంక్లు సాధించడానికి వారి ప్రతిభను చూపేందుకు సాయం చేయాలని సర్వేలో వెల్లడించారు. దీన్ని మరింత వివరించి చెబుతూ, విద్యార్థులు తాము పూర్తిచేయాల్సిన తరగతి పనులను సాయంత్రం 5 గంటల లోపే పూర్తి చేసేటట్లు, అవి రాత్రి 9 గంటలకో, మధ్య రాత్రి వరకో ఉండకుండా చూసి, విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని కాపాడొచ్చని అంటారు. అలాగే విద్యార్థులను ముందుగా నిద్రకు ఉపక్రమించేటట్లు చేయడం ద్వారా వారి విలువైన నిద్రను కోల్పోకుండా గడువును పూర్తి చేసేవిధంగా ప్రోత్సహించవచ్చని అంటారు లిప్సన్. మరి ముఖ్యంగా ఎక్కువ మంది ఉన్న తరగతి గదుల్లో కంటే వారి హాజరును త్వరగా గమనించడానికి అనువుగా ఉండే చిన్న తరగతి గదుల ద్వారా బోధకులు విద్యార్థుల్లో ఎవరు తరగతికి హాజరు కాలేదో కనుక్కొని, దానికి కారణాలను, వారి నడవడికను గురించే వారినే ప్రత్యక్షంగా వాకబు చేయవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)