World Covid: ప్రపంచదేశాల్లో నిన్న కొత్తగా 6,76,917 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 20.68 కోట్లు దాటింది. కొత్తగా 9,906 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 43.57 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.69 కోట్లు ఉన్నాయి. ఇవి మెల్లగా పెరుగుతున్నాయి. అమెరికాలో కొత్తగా 1,25,291 కేసులు, 724 మరణాలు వచ్చాయి. బ్రెజిల్లో నిన్న 33,933 కొత్త కేసులు, 874 మరణాలు సంభవించాయి. (image credit - twitter - reuters)
కరోనాను నియంత్రించే విషయంలో మరో ముందడుగు పడింది. ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్ అంటే నాజిల్ వ్యాక్సిన్‌కు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. దీనిని భారత్ బయోటెక్ కంపెనీ తయారుచేసింది. ఇప్పటికే 18 నుంచి 60 ఏళ్ల వయస్సు వారిపై మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యాయి. రెండు, మూడు దశల్లో నిర్వహించే క్లినికల్ ట్రయల్స్‌కు కేంద్రం అనుమతి ఇచ్చింది. భారత్ బయోటెక్ తయారుచేసిన ‘కోవాగ్జిన్’ వ్యాక్సిన్ ఆల్రెడీ ప్రజలు వేసుకుంటున్నారు.
కర్ణాటక రాజధాని బెంగళూరులో పిల్లలకు ఎక్కువగా కరోనా సోకుతోంది. రెండు వారాల్లో 500 మందికి పైగా పిల్లలకు పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని బెంగళూరు మున్సిపల్ కర్పొరేషన్ అధికారులు తెలిపారు. ఐతే... కర్ణాటక ప్రభుత్వం స్కూళ్లు తెరవాలి అనుకుంటున్న సమయంలో... ఈ కేసులు పెరగడం కలకలం రేపుతోంది. గత ఐదు రోజుల్లోనే 263 కేసులు వచ్చాయి. పిల్లలెవరూ చనిపోలేదు గానీ... కరోనా సోకిన వారిలో 14 శాతం మంది 19 ఏళ్లలోపు వారు ఉన్నారు. (image credit - twitter - reuters)
గురువారం దేశంలోనే ఎక్కువగా కేరళలో కొత్త కేసులు 21.4వేలు వచ్చాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో 6.4వేలు, తమిళనాడులో 1.9వేలు వచ్చాయి. అలాగే గురువారం దేశంలోనే ఎక్కువగా మహారాష్ట్రలో 208 మంది కరోనాతో చనిపోగా... ఆ తర్వాత కేరళలో 160 మంది... ఒడిశాలో 67 మంది చనిపోయారు. ప్రస్తుతం 15 రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాల్లో యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. టెస్టుల పాజిటివిటీ రేటు కేరళలో 14.49 శాతం ఉండగా... సిక్కింలో 12.55 శాతం, మణిపూర్‌లో 12.23 శాతం ఉంది. (image credit - twitter - reuters)
AP Covid: ఏపీలో కొత్తగా 73,341 టెస్టులు చెయ్యగా... కొత్తగా 1,746 పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 19,90,656కి చేరింది. కొత్తగా 20 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 13,615కి చేరింది. కొత్తగా 1,648 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 19,58,275కి చేరింది. ప్రస్తుతం 18,766 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,55,26,861 టెస్టులు జరిగాయి. (image credit - twitter)
Telangana Covid: తెలంగాణలో కొత్తగా 427 కేసులొచ్చాయి. మొత్తం కేసులు 6,51,715కి చేరాయి. కొత్తగా 609 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 6,40,065కి చేరింది. రికవరీ రేటు 98.21 శాతంగా ఉంది. రాష్ట్రంలో కొత్తగా ఇద్దరు మరణించారు. మొత్తం మరణాలు 3,838కి చేరాయి. మరణాల రేటు 0.58 శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 7,812 యాక్టివ్ కేసులున్నాయి. (image credit - twitter)