Corona Cases : మొన్నటి దాకా చైనాలో మాత్రమే ఉన్న కరోనా ఇప్పుడు ఇండియా సహా చాలా దేశాల్లో మళ్లీ విజృంభిస్తోంది. ఇండియాలోని మహారాష్ట్ర సహా కొన్ని రాష్ట్రాల్లో కొత్త కేసులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. కరోనాపై అప్రమత్తంగా ఉండాలని కోరింది.
ఒమైక్రాన్ సహా ఇప్పటివరకూ ఉన్న వేరియంట్లపై ఇండియాలోని వ్యాక్సిన్లు బాగానే పనిచేస్తున్నాయి. ఐతే.. కొత్త వేరియంట్లు వస్తే.. వాటిని త్వరగా గుర్తించి.. వ్యాక్సిన్లలో తగిన మార్పులు చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఆలస్యమైతే.. పరిస్థితి మొదటికి వస్తుంది. అందుకే కేంద్రం జీనోమ్ సీక్వెన్స్ తప్పక జరిపించాలని కోరుతోంది.