ఇండియాలో కొత్తగా... 45,148 పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 79,09,959కి చేరింది. అలాగే... కొత్తగా కరోనాతో... 480 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 1,19,014కి చేరింది. ఇండియాలో మరణాల రేటు 1.5 శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో అది 2.6 శాతంగా ఉంది. ఇండియాలో కొత్తగా 59,105 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 71.37,228కి చేరింది. దేశంలో రికవరీ రేటు మరింత పెరిగి 90.23 శాతానికి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,53,717 ఉన్నాయి. (credit - twitter - reuters)