కంటికి కనిపించని కరోనా వైరస్... ప్రపంచానికి పీడలా పట్టింది. ఎంతకీ వదలట్లేదు. ఎప్పటికి పోతుందో తెలియదు. వ్యాక్సిన్ ఇప్పట్లో వచ్చేలా లేదు. చలికాలం వచ్చేసింది. వైరస్ మరింత విజృంభిస్తోంది. యూరప్ దేశాల్లో మళ్లీ కల్లోలం మొదలైంది. తాజాగా నిన్న ప్రపంచవ్యాప్తంగా 4,36,511 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 4,68,04,418కి చేరింది. నిన్న కొత్తగా 5300 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 12,05,044కి చేరింది. ప్రస్తుతం రికవరీ కేసులు 2,37,42,719 ఉండగా... యాక్టివ్ కేసులు 1,18,56,655 ఉన్నాయి. వాటిలో 85,261 మంది పేషెంట్ల కండీషన్ సీరియస్‌గా లేదా క్రిటికల్‌గా ఉంది. (credit - twitter - reuters)