ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడంతో.. చైనా ప్రభుత్వం దిగొచ్చింది. డిసెంబరు 1 నుంచి నిబంధనలను సడలించింది. కేసుల ట్రేసింగ్ను నిలిపివేసింది. ఆ తర్వాత జనం విచ్చల విడిగా రోడ్ల మీదకు రావడంతో కరోనా ఒక్కసారిగా విజృంభించింది. దీనికి తోడు చైనాలో అతి పెద్ద వేడుకగా భావించే.. ల్యూనార్ న్యూ ఇయర్ కూడా వచ్చేస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)
ప్రస్తుతం కోవిడ్ కేసులు భారీగా పెరగడంతో.. అక్కడి ప్రభుత్వం కూడా చేతులెత్తేసింది. అందువల్లే కరోనా వ్యాప్తి భయంకరంగా పెరిగింది. ఐతే అక్కడి వాస్తవాల పరిస్థితులను చైనా ప్రభుత్వ దాచిపెడుతోందని అంతర్జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి. చైనా ఆస్పత్రులు, శ్మశాన వాటికల వద్ద దారుణ పరిస్థితులు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)