ఏపీలో కొత్తగా 599 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,70,675కి చేరింది. కొత్తగా 5గురు కరోనాతో చనిపోయారు. ఇప్పటివరకూ చనిపోయిన వారి సంఖ్య 7,020కి చేరింది. జిల్లా వారీగా చూస్తే అనంతపురంలో 24, చిత్తూరులో 92, తూర్పుగోదావరి జిల్లాలో 60, గుంటూరులో 71, కడపలో 25, కృష్ణాలో 115, కర్నూలులో 13, నెల్లూరులో 23, ప్రకాశంలో 20, శ్రీకాకుళంలో 41, విశాఖపట్నంలో 22, విజయనగరంలో 8, పశ్చిమ గోదావరిలో 85 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ 8,57,233 మంది డిశ్చార్జి కాగా 6,422కేసులు యాక్టివ్గా ఉన్నాయి. (image credit - twitter - reuters)