ప్రపంచంలో చూస్తే నిన్న కొత్త కేసులు, మరణాలూ పెరిగాయి. నిన్న కొత్త కేసులు 6,62,686 వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 8,67,98,741కి చేరింది. నిన్న 12,887 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 18,74,190కి చేరింది. మొత్తం రికవరీలు 6,15,17,454 ఉన్నాయి. యాక్టివ్ కేసులు 2,34,07,097 ఉన్నాయి. వాటిలో సీరియస్ కేసులు 1,07,870 ఉన్నాయి. ప్రస్తుతం కరోనా సోకిన ప్రతి 100 మందిలో ఒకరు చనిపోతున్నారు. అమెరికాలో కరోనా మరింత పెరిగింది. కొత్తగా 2,17,660 మందికి అది వచ్చింది. మొత్తం కేసులు 2,15,70,711కి చేరాయి. నిన్న 3,347 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 3,65,470కి చేరింది. (image credit - twitter - reuters)