ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ ఇప్పట్లో వదిలేలా కనిపించట్లేదు. తగ్గుతుందిలే అనుకుంటే... మరింత ఘోరంగా వ్యాపిస్తూ... సెకండ్ వేవ్ షేక్ చేస్తోంది. నిన్న కొత్తగా 5,70,993 మందికి కరోనా సోకింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,84,69,988కి చేరింది. నిన్న 8889 మంది కరోనా వల్ల చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 13,85,745కి చేరింది. ప్రస్తుతం రికవరీ కేసులు 4,04,57,488 ఉన్నాయి. యాక్టివ్ కేసులు 1,66,26,755కి చేరాయి. ప్రపంచంలో కరోనా సోకిన ప్రతి 100 మందిలో ఇద్దరు లేదా ముగ్గురు చనిపోతున్నారు. (credit - twitter - reuters)