ఇండియాలో కొత్తగా 74,383 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 70,53,806కి చేరింది. కొత్తగా 918 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 1,08,334కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.5 శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో ఇది 2.8 శాతంగా ఉంది. ఇండియాలో కొత్తగా 89,154 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ కేసుల సంఖ్య 60,77,976కి చేరింది. రికవరీ రేటు మరింత పెరిగి 86.2 శాతానికి చేరింది. ప్రస్తుతం ఇండియాలో యాక్టివ్ కేసులు 8,67,496 ఉన్నాయి. తాజాగా 10,78,544 టెస్టులు చెయ్యగా... మొత్తం టెస్టుల సంఖ్య 8కోట్ల 68లక్షల 77వేల 242కి పెరిగింది. (credit - twitter - reuters)