ప్రపంచదేశాల్లో రోజూ అత్యంత ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్న దేశాల్లో దాదాపు నెలకు పైగా... టాప్ ప్లేస్లో నిలిచిన ఇండియా... ఇప్పుడు రెండో స్థానానికి పడిపోయింది. రెండోస్థానంలో ఉన్న అమెరికా... మళ్లీ మొదటి స్థానానికి చేరింది. ప్రపంచవ్యాప్తంగా నిన్న 3,30,631 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 4,06,27,423కి చేరింది. అలాగే... నిన్న 4348 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 11,22,717కి చేరింది. ప్రస్తుతం రికవరీ కేసులు 3,03,39,209 ఉన్నాయి. యాక్టివ్ కేసులు 91,65,497 ఉన్నాయి. వీటిలో 72,650 మందికి కరోనా తీవ్రంగా ఉంది. వీళ్లు 1 శాతం కంటే తక్కువే. (credit - twitter - reuters)