సాధారణంగా కరోనా వేస్తే 5 నుంచి 14 రోజుల్లో కోలుకుంటారు. హోమ్ ఐసోలేషన్‌లో ఉండి.. డాక్టర్లు చెప్పిన మందులు వాడుతూ.. బలవర్ధకమైన ఆహారం తీసుకుంటే కోవిడ్ నుంచి బయటపడవచ్చు. ఒకవేళ వైరల్ లోడ్ తీవ్రంగా ఉండి.. శ్వాస తీసుకోలేని పరిస్థితి ఉంటే.. ఆస్పత్రుల్లో చికత్స పొందాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో కోలుకునేందుకు ఒక్కోసారి నెల రోజులు కూడా పట్టవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
ఇంగ్లాండ్‌లోని బ్రిస్టల్‌కు చెందిన రిటైర్డ్ డ్రైవింగ్ టీచర్ డేవ్ స్మిత్‌కు 10 నెలల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మొదట్లో స్వల్ప లక్షణాలే ఉన్నాయి. హోమ్ ఐసోలేషన్‌లో ఉండి మందులు తీసుకోవడంతో తగ్గింది. కానీ ఆ తర్వాత మళ్లీ వ్యాధి తిరగబెట్టింది. ఆస్పత్రిలో కూడా చేర్పించారు. (ప్రతీకాత్మక చిత్రం)