Covid 19 Updates: ఇప్పటివరకూ ప్రపంచ దేశాల్లో వచ్చిన కరోనా వేరియంట్లలో ప్రమాదకరమైనది డెల్టా వేరియంట్. దీన్ని గతేడాది ఇండియాలో గుర్తించారు. ఇదే మన దేశంతోపాటూ... చాలా దేశాల్లో ఎక్కువ మరణాలు, ఎక్కువ పాజిటివ్ కేసులకు కారణమైంది. ఈమధ్య దాన్ని మించిన వేరియంట్ వచ్చింది. అందుకే దానిపేరు డెల్టా ప్లస్ అని పెట్టారు. ఇప్పుడు అది మరోసారి మ్యూటేషన్ చెంది మరింత ప్రమాదకరంగా మారింది. ప్రస్తుతానికి డెల్టా ప్లస్ వేరియంట్‌ను AY-1 అంటుంటే... దాని నుంచి వచ్చిన కొత్త వేరియంట్‌ను AY-2 అంటున్నారు. ఇది అమెరికాలో కనిపిస్తోంది. ఇంకా ఇండియాకి రాలేదు. కానీ వస్తుందేమో అనే టెన్షన్ ఉంది. ఇప్పటికే డెల్టాప్లస్ అన్ని వయసుల వారిపై దాడి చేస్తోంది. మరి డెల్టా ప్లస్ 2 ఏం చేస్తుందో చూడాలి. (image credit - twitter - reuters)
కరోనా కారణంగా... ప్రజలు కొన్నేళ్లుగా పొదుపు చేసుకున్న డబ్బంతా మందులపాలైంది. దేశవ్యాప్తంగా ఈ పరిస్థితి వచ్చింది. మొత్తం 159 జిల్లాల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు పడిపోయాయి. వాటిలో తెలంగాణలో 4 జిల్లాలు ఉండగా... ఏపీలో 2 జిల్లాలు ఉన్నాయి. దురదృష్టమేంటంటే... కొంతమందికి డబ్బు పోయినా... తమవారి ప్రాణాలు దక్కలేదు. చాలా మంది పిల్లల చదువుల కోసం, పెళ్లిళ్ల కోసం, సొంత ఇంటి కోసం ఇలా ఎన్నో రకాల అవసరాల కోసం దాచుకున్న డబ్బు కాస్తా ఒక్కసారిగా పోయింది. అటు కేంద్ర ప్రభుత్వం కరోనాతో చనిపోయిన వారికి కుటుంబాలకు పరిహారం ఇచ్చే పరిస్థితుల్లో లేము అని సుప్రీంకోర్టుకు చెప్పింది. మరి ఆ కుటుంబాలు ఎలా నిలదొక్కుకుంటాయన్నది అత్యంత బాధాకరమైన అంశంగా మారింది. (image credit - twitter)
మనుషులతోపాటూ... జూలో జంతువుల విషయంలోనూ జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇకపై లాకోన్సిస్-CCMB తరచూ... జంతువుల నుంచి DNA సేకరించి... కరోనా పరీక్షలు చేయనుంది. ఇందుకు సంబంధించి నిన్న గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. నిజానికి ఈ టెస్టులను CCMB గతేడాది ఆగస్టులో ప్రారంభించింది. హైదరాబాద్ జూలోని ఆసియా సింహాల నుంచి శాంపిల్స్ సేకరించింది. ఇకపైనా తరచూ ఇలాంటి టెస్టులు చెయ్యనుంది. (image credit - twitter)
Covid 19 Updates: ఇండియాలో కొత్తగా 53,256 కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 2,99,35,221కి చేరింది. కొత్తగా 1,422 మంది మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 3,88,135కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.3 శాతంగా ఉంది. ప్రపంచదేశాల్లో ఇది 2.17 శాతంగా ఉంది. ఇండియాలో తాజాగా 78,190 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 2,88,44,199కి చేరింది. రికవరీ రేటు కొద్దిగా పెరిగి 96.4 శాతానికి చేరింది. ప్రస్తుతం భారత్‌లో 7,02,887 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 13,88,898 టెస్టులు చేశారు. భారత్‌లో ఇప్పటివరకు 39 కోట్ల 24 లక్షల 07 వేల 782 టెస్టులు చేశారు. కొత్తగా 30,39,996 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 28 కోట్ల 36 వేల 898 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. (image credit - twitter)
Telangana Covid: తెలంగాణలో కొత్తగా 1,197 కేసులొచ్చాయి. మొత్తం కేసులు 6,14,399కి చేరాయి. కొత్తగా 1,707 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 5,93,577కి చేరింది. రికవరీ రేటు 96.61 శాతంగా ఉంది. రాష్ట్రంలో కొత్తగా 9 మంది మరణించారు. మొత్తం మరణాలు 3,576కి చేరాయి. మరణాల రేటు 0.58 శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 17,246 యాక్టివ్ కేసులున్నాయి. (image credit - twitter)
AP Covid: ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా 55,002 టెస్టులు చెయ్యగా... కొత్తగా 2,620 పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 18,53,183కి చేరింది. కొత్తగా 44 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 12,363కి చేరింది. కొత్తగా 7,504 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 17,82,680కి చేరింది. ప్రస్తుతం 58,140 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,12,05,849 టెస్టులు జరిగాయి. (image credit - twitter)
World Covid: ప్రపంచదేశాల్లో కొత్తగా 2,74,525 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 17.95 కోట్లు దాటింది. కొత్తగా 5,772 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 38.88 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.14 కోట్లు ఉన్నాయి. అమెరికాలో కొత్తగా 8,668 కేసులు, 196 మరణాలు వచ్చాయి. బ్రెజిల్లో 41,878 కొత్త కేసులు... 899 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రోజువారీ ఎక్కువ కేసులు బ్రెజిల్ లేదా ఇండియాలో వస్తుంటే... ఆ తర్వాత కొలంబియా, రష్యా, ఇండొనేసియా ఉన్నాయి. రోజువారీ మరణాల్లో బ్రెజిల్ లేదా ఇండియా మొదటి స్థానంలో ఉంటుంటే... ఆ తర్వాత కొలంబియా, అర్జెంటినా, రష్యా ఉన్నాయి. (image credit - twitter - reuters)