Corona Restrictions | ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. అయితే ఇప్పటికే కొన్ని చోట్ల కేసులు భారీగా పెరిగి నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ కరోనా ఆంక్షలు సడలిస్తున్నారు.
1/ 8
1. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దెబ్బకు విలవిల్లాడి పోయింది బ్రిటన్. చాలా చోట్ల కరోనా ఆంక్షలు కఠినంగా అమలు చేసింది. మాస్క్లు, భౌతికదూరం అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
2. అయితే గత కొన్ని రోజులుగా అక్క డ కొత్త కేసులు తగ్గుతూ వస్తున్నా యి. దీంతో ఒమిక్రాన్ కట్టడి కోసం అమలు చేస్తున్న ఆంక్షలను సడలించాలని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
3. దీనిపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తాజాగా తాజాగా ఓ ప్రకటన ఇచ్చారు. మరో వారం రోజుల్లో దేశంలో మాస్కులు ధరించడం తప్పని సరి కాదని ఆయన ప్రకటించారు. (ప్రతీకాత్మక చిత్రం)
5. వచ్చే గురువారం నుంచి దేశంలో వర్క్ ఫ్రమ్ హోంలు, మాస్క్లు ధరించడం, పెద్ద పెద్ద సభలు, సమావేశాలకు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు తప్పనిసరి కాదని తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
6. ప్రజలే స్వచ్ఛందంగా భౌతిక దూరం పాటిస్తారని, అవసరమైతే మాస్క్లు పెట్టుకుంటారనే నమ్మకం తమకు ఉందని ప్రధాని తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
7. ఇకపై నిబంధనలు పాటించని వారిపై క్రిమినల్ కేసులు పెట్టబోమని స్పష్టం చేశారు. దీనిపై ప్రజల్లో హర్షం వ్యక్తం అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
8. ఒమిక్రాన్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు బ్రిటన్లో రోజుకు 2 లక్షలకు పైగా కరోనా కేసులు వచ్చేవి. ప్రస్తుతం ఈ వ్యాప్తి నుంచి బ్రిటన్ బయట పడింది. (ప్రతీకాత్మక చిత్రం).