కాలుష్యం, పర్యావరణ పరిరక్షణపై ఇటీవల చేస్తున్న పరిశోధనలు కొత్తరకం, ఆశ్చర్యకరమైన ఫలితాలను వెల్లడిస్తున్నాయి. గ్యాస్ స్టవ్‌ల వినియోగం కారణంగా ఇళ్లలో గాలి నాణ్యత దెబ్బతింటోందని, వివిధ ఆరోగ్య సమస్యలకు కారణమవుతోందన్న వార్తలు ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్నాయి. అమెరికాలో ఈ అంశం ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారింది.(ప్రతీకాత్మక చిత్రం)
నిషేధంపై పరిశీలన : గ్యాస్ స్టవ్‌ల వినియోగం కారణంగా శ్వాసకోశ, ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే కాలుష్య కారకాలు గాల్లోకి విడుదల అవుతున్నాయని యూఎస్ కన్స్యూమర్ ప్రొడక్ట్ సేఫ్టీ కమిషన్‌కు ఫిర్యాదులు అందాయి. దీంతో ఈ సంస్థ గ్యాస్ స్టవ్‌లపై నిషేధాన్ని పరిశీలిస్తోందని బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ తెలిపింది. ప్రస్తుత ప్రొడక్ట్స్ సురక్షితమా కాదా అని నిర్ధారించడానికి ఏజెన్సీ పని చేస్తోందని, సురక్షితం కాని వాటిని బ్యాన్ చేసే అవకాశం ఉందని యూఎస్ కన్స్యూమర్ ప్రొడక్ట్ సేఫ్టీ కమిషనర్ రిచర్డ్ ట్రూమ్కా జూనియర్ తెలిపినట్లు బ్లూమ్‌బెర్గ్ పేర్కొంది.(ప్రతీకాత్మక చిత్రం)
డబ్ల్యూహెచ్ఓ స్పందన : గ్యాస్ స్టవ్‌ల నుంచి కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వంటి హానికర వాయవులు విడుదలవుతున్నాయని, తద్వారా హృదయ సంబంధ సమస్యలు, క్యాన్సర్, ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. దీంతో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఇవి అంత సేఫ్ కాదని అంటోంది.(image credit - REUTERS/Denis Balibouse/File Photo)
పిల్లల్లో ఆస్తమా రిస్క్ : వోక్స్ రిపోర్ట్ ప్రకారం.. గ్యాస్ స్టవ్, ఓవెన్ వంటి గృహోపకరణాలను వినియోగిస్తున్నప్పుడు కార్బన్ మోనాక్సైడ్, ఫార్మాల్డిహైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వంటి కాలుష్య కారకాలు వంటగదిలో వ్యాప్తి చెందుతాయి. నైట్రోజన్ డయాక్సైడ్ చాలా హానికరమైన వాయువు. ఇది పెద్దవారిలో హృదయ సంబంధ సమస్యలు, శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతుంది. పిల్లల్లో ఆస్తమా రిస్క్ పెరుగుతుంది.
కొలరాడో బౌల్డర్ యూనివర్సిటీ పర్యావరణ ఇంజనీర్ షెల్లీ మిల్లర్ మాట్లాడుతూ.. ‘‘ఇంటిని కలుషితం చేసే మొదటి మార్గం గ్యాస్ స్టవ్ మీద వంట చేయడం. ఇది శ్వాసకోశ, హృదయ సంబంధ సమస్యలను కారణమవుతుంది. పిల్లల్లో ఫ్లూ, ఆస్తమా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్‌ల రిస్క్‌ను పెంచుతుంది.’’ అని షెల్లీ పేర్కొన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
పెట్రోల్ స్టవ్ వాడకంతో : ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ అండ్ పబ్లిక్ హెల్త్‌లో ప్రచురితమైన డిసెంబర్ రిపోర్ట్ ప్రకారం.. యునైటెడ్ స్టేట్స్లో దాదాపు 13 శాతం చిన్నపిల్లల ఉబ్బసం కేసులకు పెట్రోల్ స్టవ్ వాడకం కారణమవుతుంది. ఇది సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ వల్ల కలిగే నష్టంతో సమానమని ఆ రిపోర్ట్ వెల్లడించింది.
అమెరికన్ గ్యాస్ అసోసియేషన్ ఈ స్టడీలను కొట్టిపారేసింది. నిజ జీవిత ఉపకరణాల వినియోగం, ఉద్గారాల రేట్ లేదా ఎక్స్పోజర్స్ ఆధారంగా ఎటువంటి కొలతలు లేదా పరీక్షలను నిర్వహించలేదని వాదిస్తోంది. అయితే మరోపక్క వివాదమైన గ్యాస్ స్టవ్‌ల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని అమెరికా ఎనర్జీ సెక్రటరీ గ్రాన్హోమ్ ద్వారా తెలియజేశారు.