Face Mask: క్లాత్ మాస్క్ ధరిస్తున్నారా? మీకు కరోనా సోకే ప్రమాదం..నిపుణుల హెచ్చరిక
Face Mask: క్లాత్ మాస్క్ ధరిస్తున్నారా? మీకు కరోనా సోకే ప్రమాదం..నిపుణుల హెచ్చరిక
Face masks: ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియెంట్ విజృంభిస్తోంది. అమెరికాతో పాటు యూరప్ దేశాల్లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్రజలంతా మాస్క్‌లు ధరించాలని.. అప్పుడే వైరస్ బారి నుంచి తప్పించుకోవచ్చని ప్రభుత్వాలు.. డాక్టర్లు.. పదే పదే సూచిస్తున్నాయి. ఐతే మాస్క్‌లకు సంబంధించి తాజాగా ఓ వైద్య నిపుణుడు సంచలన విషయాన్ని చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ఒమిక్రాన్ వేరియెంట్‌తో చాలా దేశాల్లో కోవిడ్ కేసులు భయంకరంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని దేశాలు మాస్క్‌లను తప్పనిసరి చేశాయి. ప్రజలు కూడా మాస్క్‌లను ధరిస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 9
మాస్క్ ధరించకపోతే పలు ప్రభుత్వాలు భారీగా జరిమానాలు కూడా విధిస్తున్నాయి. మాస్క్ ధరించడం.. భౌతిక దూరం పాటించడం.. తప్పనిసరి చేస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 9
కరోనా వచ్చిన తర్వాత ఎన్నో రకాల మాస్క్‌లు మార్కెట్లో కనిపిస్తున్నాయి. ఎన్ 95, సర్జికల్, సాధారణ క్లాత్ మాస్క్... ఇలా చాలానే ఉన్నాయి. ఐతే ప్రస్తుతం చాలా మంది క్లాత్ మాస్క్‌లను వినియోగిస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 9
ఐతే క్లాత్ మాస్క్‌ల గురించి తులానే యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ మైక్రోబయాలజిస్ట్ డాక్టర్ చాద్ రాయ్ కీలక విషయాలను వెల్లడించారు. క్లాత్ మాస్క్‌లు వేస్ట్ అని.. వాటిని వాడడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 9
క్లాత్ మాస్క్‌లు కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పించలేవని..ఆ మాస్క్‌లు పెట్టుకొని బయట తిరిగితే కరోనా వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. క్లాత్ మాస్క్‌లో పాటు సర్జికల్ మాస్క్‌లను ఉపయోగించినా ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 9
ప్రస్తుతం మన వద్ద ఒక్క సర్జికల్ మాస్క్ రూ.2-10కి లభిస్తోంది. దీనిని ఒక్కసారి వాడితే తిరిగి వాడకూడదు. పడేయాల్సిందే. ఇక క్లాత్ మాస్క్‌లు రూ.20-30 మధ్య అందుబాటులో ఉన్నాయి. అందుకే చాలా మంది వీటినే వినియోగిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 9
కానీ ఈ మాస్క్‌లు వేస్ట్ అని చాద్ రాయ్ స్పష్టం చేస్తున్నారు. ఎన్-95 వంటి రెస్పిరేటరీ మాస్క్‌లను వినియోగిస్తేనే ప్రయోజనం ఉంటుందని.. కరోనా నుంచి అవి రక్షణ కల్పిస్తాయని చెప్పారు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 9
కానీ ఈ మాస్క్‌లు వేస్ట్ అని చాద్ రాయ్ స్పష్టం చేస్తున్నారు. ఎన్-95 వంటి రెస్పిరేటరీ మాస్క్‌లను వినియోగిస్తేనే ప్రయోజనం ఉంటుందని.. కరోనా నుంచి అవి రక్షణ కల్పిస్తాయని చెప్పారు. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 9
అందుకే మాస్క్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్లాత్ మాస్క్ ధరించి.. మాకేం కాదులే... అన్నట్లుగా వ్యవహరించకూడదని సూచిస్తున్నారు. కాస్త ఖర్చు ఎక్కువైనా.. ఎన్-95 వంటి రెస్పిరేటరీ మాస్క్‌లనే వాడాలని చెబుతున్నారు. ప్రతీకాత్మక చిత్రం)