China's COVID vaccine fail: మనందరికీ తెలుసు... కరోనా వ్యాక్సిన్ ఏదైనా సరే... దాన్ని వేసుకున్న తర్వాత కూడా కరోనా సోకే అవకాశాలు 100 శాతం ఉంటాయి. ఐతే... వ్యాక్సిన్ వేసుకున్న వ్యక్తికి కరోనా సోకినా... ఆ వ్యక్తి నుంచి అది ఇతరులకు సోకకుండా వ్యాక్సిన్ పనిచెయ్యాలి. అలా చెయ్యకపోతే... ఆ వ్యాక్సిన్ ఫెయిల్ అయినట్లే. చైనా వ్యాక్సిన్ విషయంలో ఇదే జరుగుతోంది. (image credit - twitter - reuters)
నాశిరకం ఉత్పత్తులను తయారుచెయ్యడంలో నంబర్ వన్ అయిన చైనా... చివరకు కరోనా వ్యాక్సిన్లను కూడా అలాంటివే చేసినట్లు పరిస్థితి కనిపిస్తోంది. చాలా దేశాలు హడావుడిగా... చైనా వ్యాక్సిన్ డోసులు కొనేసి... తమ ప్రజలకు వేసేశాయి. ఇప్పుడా దేశాల్లో కరోనా మళ్లీ పెరుగుతోంది. ఎందుకంటే... ఆ వ్యాక్సిన్లు పనిచెయ్యకపోవడం వల్లేనని తెలిసింది. (image credit - twitter - reuters)
చైనా మోసం చేసిందా: జిత్తుల మారి చైనా ఎత్తులు వెయ్యడంలో దిట్ట. తమ దేశంలో కరోనాను కంట్రోల్ చేసి... తమ వ్యాక్సిన్ల వల్లే కరోనా కంట్రోల్ అయ్యిందనే భావనను ప్రపంచ దేశాలకు కలిగేలా చేసింది. దాంతో... చాలా దేశాలు చైనాను గుడ్డిగా నమ్మి... పెద్ద ఎత్తున వ్యాక్సిన్ల కోసం ఆర్డర్లు ఇచ్చాయి. అతి తెలివితో ఉన్న డ్రాగన్... గబగబా బిజినెస్ చేసేసుకుంది. నీళ్ల లాంటి వ్యాక్సిన్లు అమ్మేసి... పెద్ద ఎత్తున డబ్బు సంపాదించుకుంది. చైనా చేతిలో మోసపోయిన వర్ధమాన అభివృద్ధి చెందుతున్న దేశాలు... ఇప్పుడు రేటు ఎక్కువైనా అమెరికా లాంటి దేశాల వ్యాక్సిన్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. (image credit - twitter - reuters)
చిలీ, బహ్రైన్, మంగోలియా లాంటి దేశాలు 50 నుంచి 68 శాతం మంది ప్రజలకు వ్యాక్సిన్ వేశాయి. కొన్ని దేశాలు అమెరికా కంటే ముందు ఉన్నాయి. ప్రపంచంలో కరోనాను ఎక్కువగా ఎదుర్కొన్న టాప్ 10 దేశాల్లో నాలుగు దేశాలు చైనా నుంచి వచ్చిన సినోఫార్మ్ (Sinopharm), సినోవాక్ బయోటెక్ (Sinovac Biotech) వ్యాక్సిన్లను వాడాయి. ఆ దేశాల్లో కరోనా మళ్లీ పెరుగుతోంది. అటు... ఇజ్రాయెల్ లాంటి దేశాలు మాత్రం అమెరికాకు చెందిన ఫైజర్ (Pfizer) వ్యాక్సిన్ వాడింది. ఇజ్రాయెల్లో కరోనా బాగా కంట్రోల్ అయ్యింది. అక్కడ ఇప్పుడు ప్రజలు మాస్కులు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది. (image credit - twitter - reuters)
వ్యాక్సిన్ ఆఫర్లు: చైనా చాలా దేశాలకు వ్యాక్సిన్లు కావాలంటే మమ్మల్ని అడగండి అంటూ... కోట్ల వ్యాక్సిన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. కానీ ఆ వ్యాక్సిన్లు తమకు వద్దని విదేశాల్లో ప్రజలు అంటున్నారు. అటు తిరిగీ, ఇటు తిరిగీ ఇప్పుడు వ్యాక్సిన్ల వ్యాపారం అమెరికాకు బాగా కలిసొచ్చేలా కనిపిస్తోంది. మన ఇండియాలో తయారయ్యే వ్యాక్సిన్లు కూడా బాగానే పనిచేస్తున్నా... ఉత్పత్తి అయ్యేవి ఇండియాకే సరిపోని పరిస్థితి ఉంది. (image credit - twitter - reuters)