కరోనా వైరస్ ను తక్కువగా అంచనా వేసి నిర్లక్ష్యంగా ఉండొద్దంటూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ గత గురువారం లేఖలు రాశారు. టెస్ట్, ట్రాక్, ట్రీట్, అవసరమైన చర్యలు, వ్యాక్సినేషన్ అనే ఐదంచెల వ్యూహాన్ని పాటించాలని, ప్రజలంతా కరోనా మార్గదర్శకాలను పాటించేలా చూడాలిని లేఖలో సూచించారు.