China Covid 19 : చైనాలో నిమ్మకాయల ధరలు డబుల్ అయ్యాయి. అసలు కొందామన్నా దొరకని పరిస్థితి ఉంది. ఎక్కడైనా ఎవరైనా నిమ్మకాయలు అమ్మితే.. హాట్ కేకుల్లా అయిపోతున్నాయి. ప్రజలు గుంపులుగా వచ్చి.. భారీగా కొనుక్కొని పట్టుకుపోతున్నారు. చెట్లకు డబ్బులు కాయడం అంట ఇదేనేమో అనుకుంటున్నారు అక్కడి రైతులు. (image credit - reuters)
వ్యాక్సిన్లతో పని అవ్వట్లేదు కాబట్టి సహజమైన పద్ధతుల్లోనైనా కరోనాను ఎదుర్కోవాలని చైనా ప్రజలు భావిస్తున్నారు. నిమ్మరసం, పసుపు, అల్లం, వెల్లుల్లి, పుదీనా, మిరియాల వంటివి సహజ పద్ధతిలో ఆరోగ్యాన్ని కాపాడతాయి. కరోనా వచ్చిన కొత్తలో భారతీయులు కూడా ఇలాంటివి పాటించారు. కానీ చైనాలో వ్యాక్సిన్లు ఉన్నా.. అవి పనిచేయకపోవడంతో నిమ్మకాయలపై ఆధారపడుతున్నారు అక్కడి ప్రజలు. (image credit - reuters)
చైనాలో ప్రస్తుతం ఒమైక్రాన్ వేరియంట్ ఉంది. అది అక్కడి వ్యాక్సిన్లను ఎదుర్కొంటోంది. మన దేశంలో కూడా సెకండ్‌వేవ్‌లో ఒమైక్రాన్ భయపెట్టింది. కానీ అది త్వరగానే పోయింది. మన దేశంలోని వ్యాక్సిన్లు కరోనాపై బాగా పనిచేశాయి. ఇక్కడి ఎండ వాతావరణం కూడా కరోనా వైరస్ ఎక్కువగా పెరగకుండా ఉండేందుకు వీలుగా ఉంది. చైనాలో చల్లదనం ఎక్కువ కాబట్టి.. అక్కడి గాలిలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. (image credit - reuters)