China - Corona : జ్వరం, జలుబు, దగ్గు ఇలాంటి వాటిని మనం సాధారణ ఇన్ఫెక్షన్లుగా భావిస్తాం కదా. ఇప్పుడు వీటి సరసన కరోనా (Coronavirus)ను కూడా చేర్చింది చైనా. క్వారంటైన్ ఎత్తివేసింది. ఇవాళ్టి (ఆదివారం) నుంచి.. కరోనా కూడా సాధారణ వ్యాధే. అది సోకిన వాళ్లపై ఎలాంటి కఠిన ఆంక్షలూ లేవు. (Image credit - Reuters)
ఇవాళ్టి నుంచి అన్ని ఎయిర్పోర్టులూ, ప్రయాణాలు, వ్యాపారాలు, ఓడరేవులు అంతటా ఆంక్షలేవీ ఉండవు. ఇక దేశాల మధ్య సరిహద్దు ఆంక్షలు లేవు. అంతేకాదు విదేశాల నుంచి చైనాకు వచ్చేవారికి క్వారంటైన్, కరోనా పరీక్షలు ఉండవు. అంతేకాదు... క్వారంటైన్లో ఉన్నవారిని ఇవాళ విడుదల చేస్తారు. వారి ఆస్తుల్ని వారికి అప్పగిస్తారు. వారిపై ఉన్న కేసుల్ని తొలగిస్తారు. ఆందోళన చేస్తున్నవారు.. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. (Image credit - Reuters)
మరి ఆంక్షల్ని ఎత్తేసినంతమాత్రాన, కరోనాను సాధారణ వ్యాధిగా ప్రకటించినంతమాత్రాన చైనాలో కరోనా పోతుందా అంటే చెప్పలేని పరిస్థితి. ఆ దేశంలో వాడిన రెండు వ్యాక్సిన్లు పనిచెయ్యలేదు. ప్రజల్లో యాంటీబాడీలు సరిగా ఉత్పత్తి కాలేదు. అందువల్ల ప్రజల్లో ఇమ్యూనిటీ పెరగలేదు. ఇప్పుడు క్వారంటైన్ ఎత్తివేయడం కరెక్టేనా అనే ప్రశ్న తలెత్తుతోంది. (Image credit - Reuters)
ఓవైపు చైనాలో కరోనా తగ్గలేదు. శనివారం కొత్తగా 10,681 కేసులు నమోదైనట్లు తెలిసింది. చాలా మంది చనిపోతున్నారని ప్రచారం జరుగుతోంది. దానికి తోడు జనవరి 22న చైనా ప్రజలు భారీ ఫెస్టివల్ చేసుకోబోతున్నారు. దాని కోసం వారు ఇప్పటి నుంచే రెడీ అవుతున్నారు. ఇలాంటి సమయంలో చైనా తీసుకున్న నిర్ణయం ప్రపంచ దేశాలకు కలవరం కలిగిస్తోంది. (Image credit - Reuters)