China COVID data : చైనాలో కరోనా డేటా ప్రకారం.. ఆ దేశంలో కొత్తగా కరోనా వైరస్ వేరియంట్ ఏదీ లేదనీ.. ఐతే.. కరోనా వల్ల ఎంత మంది చనిపోయారు అనే అంశంపై లెక్కల్ని ఆ దేశం తక్కువగా చూపుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. ఓవైపు ఆ దేశంలో కరోనా ఇంత తీవ్రంగా ఉంటే.. మరణాలు ఇంత తక్కువగా ఎలా ఉంటాయని WHO ప్రశ్నించింది. (image credit - reuters)
WHO అధికారులు.. చైనా సైంటిస్టులను కలిసిన తర్వాతి రోజు.. చైనాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC).. కరోనా డేటాను ఐక్యరాజ్యసమితి ఏజెన్సీకి ఇచ్చింది. ఆ డేటాను ఏజెన్సీ తాజాగా రిలీజ్ చేసింది. దాని ప్రకారం చైనాలో రోజూ సింగిల్ ఫిగర్లో మాత్రమే (రోజూ 9 మంది లోపే) కరోనాతో చనిపోతున్నారు. (image credit - reuters)
చైనాలో పెద్ద సంఖ్యలో జనం చనిపోతున్నట్లు రిపోర్టులు చెబుతుంటే.. ప్రభుత్వం ఇలాంటి డేటా ఇవ్వడంతో WHO డైరెక్టర్ జెనరల్ టెడ్రోస్ అధానమ్ నమ్మలేకపోతున్నారు. ఇకపై చైనాలోని ఆస్పత్రుల్లో ఎంత మంది చేరుతున్నారు? ఎంతమంది చనిపోతున్నారో? తరచూ డేటా తీసుకోవాలని ఐరాస ఎమర్జెన్సీస్ డైరెక్టర్ మైక్ ర్యాన్‌ను కోరారు. (image credit - twitter - @DrTedros)
చైనాలో జనాభా 140 కోట్ల మంది. అక్కడ ఎండ తక్కువగా ఉంటుంది కాబట్టి.. చైనా ప్రజల్లో ఇమ్యూనిటీ తక్కువగా ఉంది. అందువల్లే మూడేళ్లుగా అక్కడ కరోనా తగ్గట్లేదు. ఐతే.. చైనా వల్ల ప్రపంచ దేశాలకు అది పాకుతోంది. ఇండియాలో కరోనా అంతగా లేకపోయినా.. చైనా వల్ల మళ్లీ పెరుగుతుందేమో అనే ఆందోళన ఉంది. (image credit - reuters)