China Accident: చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది దుర్మరణం..
China Accident: చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది దుర్మరణం..
China Accident: తూర్పు చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జియాంగ్జీ ప్రావిన్స్‌లో ఆదివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. మరో 22 మంది గాయపడ్డారు.
తూర్పు చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జియాంగ్జీ ప్రావిన్స్‌లోని నాన్‌చాంగ్ కౌంటీలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. మరో 22 మంది గాయపడ్డారు.
2/ 5
గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చైనా కాలమానం ప్రకారం.. అర్ధరాత్రి 1 గంట సమయంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు చైనాకు చెందిన సీసీటీవీ వార్తా సంస్థ తెలిపింది.
3/ 5
సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.
4/ 5
దట్టమైన పొగమంచు వల్ల హైవేపై వెళ్తున్న వాహనాలు.. ఒకదానిని మరొకటి ఢీకొన్నట్లు సమాచారం. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాత్రిళ్లు, తెల్లవారుఝామను ప్రయాణం చేసేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
గత ఏడాది సెప్టెంబరులోనూ చైనాలోనూ ఘోర ప్రమాదం జరిగింది. గుయ్జౌ ప్రావిన్స్‌లో ఓ బస్సు బోల్తా పడి 27 మంది ప్రయాణికులు చనిపోయారు. కోవిడ్ రోగులను క్వారంటైన్‌కు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.