‘ఆ సమయంలో చే గువేరా నాకు పెద్దగా, అతి పెద్దగా, భారీగా కనిపించారు. ఆయన కళ్లు ప్రకాశవంతంగా మెరుస్తున్నా యి. ఆయన నావైపు స్థిరంగా చూశారు. ఆయన ఒకే కదలికతో నన్ను నిరాయుధుడిని చేయగలడనుకున్నాను. కానీ, అలా చేయలేదు. ఆయన నాతో గురిపెట్టండి.. మీరు ఓ వ్యక్తిని చంపబోతున్నారు.. అన్నారు. దీంతో నేను ఒక అడుగు వెనక్కువేసి, కళ్లు మూసుకొని కాల్చేశాను’అని టెరాన్ తన అనుభవాన్ని చెబుతారు.