Cannes 2019 : కేన్స్‌లో మెరిసిన భారతీయ అందం.. ప్రియాంకను చూస్తే మతిపోవాల్సిందే

Cannes 2019 : ఫ్రాన్స్‌ దేశంలోని కేన్స్ నగరంలో 72వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి భారతీయ అందం ప్రియాంక చోప్రా హాజరైంది. ప్రియాంక అక్కడ రెడ్ కార్పెట్‌పై నడుస్తుంటే..వీక్షకుల మతులు పోయాయంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆమె తన అందచందాలతో అదరగొట్టింది.