బ్యాంక్ వద్ద పేలుడు బాంబు వల్లే సంభవించిందనే వాదనను స్థానిక పోలీస్ అధికారులు కొట్టిపారేశారు. బ్యాంక భవంతి కిందనే పెద్ద నాలా ఒకటుందని, నిజం చెప్పాలంటే నాలా పైనే బ్యాంకు ఉన్న భవంతిని నిర్మించారని, ఆ నాలాలో కొద్ది రోజులుగా ప్రమాదకర వాయువులు పేరుకుపోయి.. చివరికి పేలుడుకు దారి తీసిందని అధికారులు చెబుతున్నారు.
కరాచీలోని బ్యాంకు భవనం కింద ఉన్న డ్రెయిన్లో వాయువులు పేరుకుపోవడంతో పేలుడు సంభవించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. పేలుడు తర్వాత భవంతి మొత్తాన్ని ఖాళీ చేయించామని, డ్రైనేజ్ లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తున్నామని అధికారులు చెప్పారు. డ్రైనేజీలో వాయువల కారణంగా ఇంత శక్తిమంతమైన పేలుడు సంభవించడం ఏమిటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.