China Covid 19 : కరోనా ఏ దేశంలో ఉన్నా.. అది ఏ స్థాయిలో ఉందో తెలుసుకొని దాన్ని బట్టీ చుట్టుపక్కల దేశాలు అలర్ట్ అవుతాయి. మన పక్కనే ఉన్న చైనా.. కరోనా తాజా లెక్కలు చెప్పకపోవడంతో.. భారత్ ఏ స్థాయిలో అలర్ట్ అవ్వాలి అనేది తెలియట్లేదు. ఓవైపు కోట్ల సంఖ్యలో కేసులు నమోదయ్యాయని ఊహాజనిత లెక్కలు బయటకు వస్తున్నా.. వాటిని నమ్మాలా వద్దా అనేది సమస్య. (image credit - reuters)
కరోనా లెక్కలను మొదటి నుంచి డ్రాగన్ దేశం దాచిపెడుతునే ఉంది. అసలు ఇప్పుడు చైనాలో ఉన్నది ఎన్నో వేవ్ అన్నది కూడా ప్రపంచానికి తెలియదు. కొత్త కేసులు ఎన్ని, ఎంత మంది చనిపోతున్నారు? ఎన్ని యాక్టివ్ కేసులు ఉన్నాయి? ఏయే వేరియంట్లు తీవ్రంగా వ్యాపిస్తున్నాయి? ఈ వివరాలేవీ చైనా... ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)కు ఇప్పుడు ఇవ్వట్లేదు. మొన్నటిదాకా ఇచ్చినా.. అవి నమ్మేలా లేవు. చైనా తీరుతో ప్రపంచ దేశాలు విసుగెత్తిపోతున్నాయి. (image credit - reuters)
2019 చివర్లో చైనా నుంచే కరోనా ప్రపంచానికి వ్యాపించింది. అప్పట్లో కూడా చైనా.. చాలా విషయాల్ని దాచిపెట్టింది. అసలు ఈ కరోనా ఎలా వచ్చిందో ఇప్పటికీ తెలియదంటోంది. వుహాన్ ల్యాబ్లో కరోనాపై పరిశోధనలు జరుపుతుండగా.. లీక్ అయి.. ఈ వైరస్ వ్యాపించిందనే వాదన ఉన్నా.. చైనా దీన్ని ఒప్పుకోవట్లేదు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ప్రపంచదేశాలకు కరోనా ఓ పీడకలలా మారింది. (image credit - reuters)
ప్రస్తుతం చైనాలో రోజూ 10 లక్షల కొత్త కేసులు వస్తున్నాయనీ.. మున్ముందు రోజూ 20 లక్షల దాకా రాగలవు అనే ఓ కొత్త అంచనా ఉంది. ఇది కొంత నమ్మేలాగా ఉంది. ఎందుకంటే పక్కనే ఉన్న జపాన్లో ఆదివారం కొత్తగా 1.49 లక్షల పాజిటివ్ కేసులు వచ్చాయి. రాజధాని టోక్యోలో కొత్తగా 15,403 కేసులు వచ్చాయి. నిన్న జపాన్లో 306 మంది చనిపోయారు. (image credit - reuters)
చైనా తన కరోనా లెక్కలను దాచేస్తూ ఉండటానికి ప్రధాన కారణం మున్ముందు రాబోయే విపత్తే అని తెలుస్తోంది. ప్రస్తుతం చైనాను BF.7 అనే వేరియంట్ వేధిస్తోంది. ఇది కరోనా ఒమైక్రాన్ వేరియంట్లో భాగమే. ఒమైక్రాన్ను సరిగ్గా ఎదుర్కోలేకపోయింది చైనా. ఎక్కువ కాలం ఆ వేరియంట్ కొనసాగేలా చేసింది. ఫలితంగా దానిలో మార్పులు (mutation) జరిగి... BF.7 పుట్టింది. అది మరింత వేగంగా వ్యాపించగలుగుతోంది. (image credit - reuters)
ఇప్పుడున్న పరిస్థితుల్లో BF.7ని ఎదుర్కొనే స్థితిలో చైనా లేదనే అభిప్రాయం నిపుణులలో ఉంది. అంటే ఈ వేరియంట్ చాలా కాలం కొనసాగి.. దీని నుంచి కొత్త వేరియంట్లు పుట్టే ప్రమాదం ఉంది. అలా పుడితే.. అవి మరింత బలంగా ఉంటాయి. మరింత వేగంగా వ్యాప్తి చెందుతాయి. అదే జరిగితే ప్రపంచ దేశాలు చైనాపై మరింతగా మండిపడతాయి. అందుకే చైనా గోప్యత పాటిస్తోంది. కరోనా లెక్కలు చెప్పకుండా.. ప్రపంచ దేశాలను ముప్పులో ముంచేస్తోంది. (image credit - reuters)
చైనా తీరుపై వైరాలజీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తన్నారు. BF.7 వల్ల చాలా మంది చనిపోతున్నారనీ.. దాన్ని చైనా త్వరగా అడ్డుకోకపోతే.. నెక్ట్స్ వచ్చే వేరియంట్ మరింత ఎక్కువగా ప్రాణ నష్టం కలిగించగలదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనా నుంచి ఇతర దేశాలకు వ్యాపిస్తున్న BF.7 ఆ దేశాల్లో కేసులు పెరిగేందుకు కారణం అవుతోంది. అక్కడ మున్ముందు అది ఎలాంటి విపత్తుకు దారితీస్తుందో తెలియట్లేదు. (image credit - reuters)
ప్రస్తుతానికి ఇండియా మాత్రం సేఫ్ మోడ్లో ఉందనే అభిప్రాయం నిపుణుల్లో ఉంది. కరోనాను సమర్థంగా ఎదుర్కొన్నందు వల్ల భారతీయులలో హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చిందనీ.. సహజంగానే కరోనా వైరస్ను ఎదుర్కొనేలా భారతీయుల ఇమ్యూనిటీ పెరిగిందని అంచనా వేస్తున్నారు. అందువల్ల BF.7 ఇండియాలో అంతగా ప్రభావం చూపకపోవచ్చు అంటున్నారు. అలాగని నిర్లక్ష్యంగా ఉండకూడదనీ.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలనీ కోరుతున్నారు. (image credit - reuters)