Afghanistan crisis: వచ్చే 24 గంటల్లో కాబూల్‌లో మరోసారి ఉగ్రవాదులు దాడికి పాల్పడే ప్రమాదం ఉంది అని అమెరికా తాజాగా హెచ్చరించింది. ఈ వార్నింగ్ స్వయంగా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ నుంచే వచ్చింది. కాబూల్ అంత్జాతీయ ఎయిర్‌పోర్టు దగ్గర మరో ఎటాక్ జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్న ఆయన.... గురువారం ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా తాము కూడా దాడి చేస్తామని ప్రామిస్ చేశారు. "అక్కడి పరిస్థితులు కంటిన్యూగా అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయి. విమానాశ్రయానికి ఉగ్రవాదుల ముప్పు చాలా ఎక్కువగానే ఉంది" అని బిడెన్ తన స్టేట్మెంట్లో ఉన్నారు. "మా కమాండర్లు నాకు చెప్పారు... వచ్చే 24-36 గంటల్లో మరోసారి దాడి జరగవచ్చని అన్నారు" అని బిడెన్ చెప్పారు. (image credit - twitter - reuters)
శనివారం సాయంత్రం... కాబూల్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఓ ప్రకటన జారీ చేసింది. ఎయిర్పోర్ట్ దగ్గర్లోని అమెరికన్లంతా... వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలి అని చెప్పింది. కచ్చితంగా దాడి జరుగుతుంది అని స్టేట్మెంట్లో చెప్పింది. అమెరికన్లు ఎవరూ ఎయిర్పోర్ట్ దగ్గరకు వెళ్లొద్దు. అక్కడి ఏ గేట్ దగ్గరా ఉండొద్దు అని కోరింది. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ సౌత్ గేట్ దగ్గర, ఎయిర్పోర్ట్ సర్కిల్ దగ్గర, పంజ్‌షిర్ పెట్రోల్ స్టషన్ దగ్గర, ది న్యూ మినిస్ట్రీ ఆఫ్ ది ఇంటీరియర్ దగ్గర అస్సలు ఉండొద్దని చెప్పింది. (image credit - twitter - reuters)
అమెరికా సైన్యం మంగళవారం నెలాఖరు నాటికి ఆఫ్ఘనిస్థాన్ విడిచి వెళ్లిపోవాలని తాలిబన్లు డెడ్‌లైన్ పెట్టారు. అప్పటికల్లా తమ ప్రజలను తీసుకుపోవాలని అమెరికా గట్టిగా ప్రయత్నిస్తోంది. ఆ తర్వాత వెంటనే సైన్యాన్ని కూడా తీసుకుపోవాలి అనుకుంటోంది. ప్రస్తుతం మహా అయితే 350 మంది అమెరికన్లు ఆఫ్ఘనిస్థాన్‌లో ఉన్నారు. వాళ్లను తీసుకెళ్లడం అమెరికాకు పెద్ద సమస్యేమీ కాదు. ఎయిర్‌పోర్టులో వీలు కాకపోతే... యుద్ధ హెలికాప్టర్లతో ఎక్కడి నుంచైనా పట్టుకుపోగలదు. ఎయిర్పోర్ట్ ద్వారా అయితే తక్కువ ఖర్చుతోనే పనైపోయింది. అదే యుద్ధ హెలికాప్టర్లను వాడితే... ఖర్చు చాలా ఎక్కువవుతుంది. అందుకే బిడెన్ ఆ ప్లాన్ అమలు చెయ్యట్లేదని తెలుస్తోంది. (image credit - twitter - reuters)
గురువారం కాబూల్ ఎయిర్పోర్ట్ బయట చెక్ పాయింట్ దగ్గర జనం గుంపులుగా ఉన్న సమయంలో ఓ ISIS-K సంస్థ ఉగ్రవాది... తనను తను పేల్చేసుకున్నాడు. ఈ దాడిలో 13 మంది అమెరికా సైనికులు చనిపోగా... 110 మందికి పైగా ఆఫ్ఘాన్ ప్రజలుచనిపోయారు. దీనికి ప్రతీకారంగా శుక్రవారం... ISIS-K సంస్థ స్థావరాలపై అమెరికా డ్రోన్ దాడులు చేసింది. ఈ ISIS-K అనేది ఐసిస్ (ISIS) అనుబంధ శాఖ. తామే ఈ దాడి చేయించామని ఐసిస్ చెప్పుకుంది. ఈ క్రమంలో డ్రోన్ దాడితోనే తాము ఆగిపోమనీ... ఇలాంటి చర్యలకు పాల్పడేవారిపై తమ ప్రతీకార దాడులు కంటిన్యూగా ఉంటాయని బిడెన్ ప్రకటించారు. ఐతే... అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ఉగ్రవాదులు ఎవరైనా చనిపోయారా అన్నది బయటపెట్టలేదు. (image credit - twitter - reuters)