Pentagon talks: ఓవైపు ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు లాగేసుకున్నారు. మరోపైపు ఐసిస్ (ISIS) తాలూకు ఉగ్రమూకలు రెచ్చిపోతున్నాయి. ఆగస్ట్ 31 తర్వాత తాలిబన్లు (Taliban) ఇంకా రెచ్చిపోయే ప్రమాదం ఉంది. అదీ కాక... అమెరికా సెప్టెంబర్ 11 దాడుల వెనక ఒసామా బిన్ లాడెన్ (Bin Laden) హస్తం లేదని తాలిబన్లు కొత్త స్వరం అందుకున్నారు. ఇటు పాకిస్థాన్... ఉగ్రవాదులను రెచ్చగొడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ ఉగ్రవాద కదలికలు (terrorism) పెరుగుతున్నట్లు అమెరికా భావిస్తోందా? అందుకే చైనాను తన కంట్రోల్లోకి తెచ్చుకొని... ఉగ్రవాదంపై పోరుకు సిద్ధమవుతోందా... తాజా పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తోంది. (image credit - twitter - reuters)
తాలిబన్ల కొత్త ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని చైనా ప్రకటించింది. ఐతే... అల్లర్లు చేస్తే మాత్రం సహించే ప్రసక్తి ఉండదని వార్నింగ్ ఇచ్చింది. ఇలాంటి సమయంలో ఉగ్రవాదులకు చైనా మద్దతు లేకుండా చెయ్యాలని అమెరికా వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. తాజా ఉగ్ర దాడుల్లో తమ సైన్యం పది మంది చనిపోవడాన్ని ఏమాత్రం భరించలేకపోతున్న అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ (Joe Biden)... ఉగ్రవాదంపై మళ్లీ భారీ పోరుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అందుకోసం చైనా మద్దతు పొందేందుకు అమెరికా రక్షణ విభాగం... బిడెన్ జనవరిలో అధికారంలోకి వచ్చాక... తొలిసారి చైనా సైన్యంతో టెలిఫోన్ లింక్ ద్వారా మాట్లాడింది. (image credit - twitter - reuters)
తాజా పరిణామాల వల్ల రెండు దేశాలకూ ఎలాంటి ముప్పు రావచ్చు అనే అంశంపై ఈ చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ట్రంప్ హయాంలో చైనా-అమెరికా మధ్య దాదాపు అన్ని అంశాల్లో పచ్చగడ్డి వేస్తే భగ్గుమంది. తైవాన్ అంశం, వాణిజ్యం పన్నులు, దక్షిణ చైనా సముద్రంపై నియంత్రణ, టిబెట్ కంట్రోల్, హాంగాంగ్ నిరసనలు ఇలా ఎన్నో అంశాలపై చైనా వైఖరిని ట్రంప్ ఖండిస్తూ వచ్చారు. ప్రతి అంశంలో మెతక వైఖరి అవలంబిస్తున్న జో బిడెన్.. ప్రపంచంలో రెండో పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాతో వైరం మంచిది కాదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. (image credit - twitter - reuters)
తాజాగా తేలిందేంటంటే అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్... చైనా సైన్యంతో చర్చలు జరపనున్నారు. ఐతే... చైనా నుంచి ఎవరు ఈ చర్చలో పాల్గొనాలి అనే అంశంపై చైనా ప్రభుత్వం ఇంకా ఏదీ తేల్చలేదు. పోటీతత్వంతో పని జరగదన్న అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (Kamala Harris) చైనాతో చర్చల ద్వారానే ముందుకెళ్తామన్నారు. ఆసియాలో యుద్ధం చెయ్యాలన్నా... ఉగ్రవాదుల్ని ఏరి పారేయాలన్నా... అమెరికాకు ఆసియా దేశాల నుంచి బలమైన మద్దతు కావాలి. అలాగే సముద్రంలో యుద్ధ నౌకల్ని ఉంచేందుకు కూడా అవకాశం కావాలి. అందుకు చైనా నుంచి సపోర్ట్ లభిస్తే... ఇక తిరుగుండదని అమెరికా భావిస్తున్నట్లు తెలుస్తోంది. (image credit - twitter - reuters)
యుద్ధం వల్ల అనవసర ఖర్చు తప్పితే... ఒరిగిందేమీ లేదని మొన్నటిదాకా బిడెన్ భావించారు. కానీ... ఎప్పుడైనా ఆఫ్ఘనిస్థాన్‌లో తమ సైన్యం 10 మందిని ఉగ్రవాదులు చంపేశారో... ఆ క్షణం నుంచి బిడెన్ కూడా ట్రంప్ లాగే... ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి మున్ముందు ఎలా ముందుకెళ్తారన్నది ఆసక్తికరం. (image credit - twitter - reuters)