శిథిలాల కింద అధిక శాతం మంది చిక్కుకుపోవడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. భూకంప తీవ్రత 7.8గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. టర్కీలోని గాజియాన్ తెప్ ప్రాంతానికి 33 కిలోమీటర్ల దూరంలో 18 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. Image source Twitter/drkerem
భూకంప కేంద్రం సిరియా అంతర్యుద్ధానికి చెందిన శరణార్థులకు నిలయంగా ఉంది. వీరిలో చాలా మంది కనీస ఆరోగ్య రక్షణ లేకుండా దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారు. భూకంపంతో ప్రభావితమైన సిరియా భూభాగాన్ని ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రాంతాలు, ప్రతిపక్షాల ఆధీనంలో ఉన్న ప్రాంతాలుగా విభజించారు. Image source Twitter/omarsuleiman504
భూకంపం కారణంగా టర్కీలో ఎమర్జెన్సీని ప్రకటించారు. టర్కీలో భారీగా భవనాలు కూలిపోవడంతోపాటు ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. తక్షణమే సహాయక చర్యలు ప్రారంభించినట్లు టర్కీ అధ్యక్షుడు ఎర్దోవాన్ ప్రకటించారు. భూకంప ప్రభావిత ప్రాంతాలకు సహాయక చర్యల బృందాలను పంపినట్లు ఆయన తెలిపారు. Image source Twitter/SaqibIlyas12