Corona Updates : ఎప్పుడైతే చైనాలో కరోనా విజృంభించిందని తెలిసిందో.. అప్పుడే దాని గురించి రకరకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అసలు లెక్కలు చైనా చెప్పకపోవడంతో.. ఎవరికి నచ్చిన ఫిగర్ వాళ్లు చెప్పేస్తున్నారు. దీని వల్ల ప్రజల్లో కరోనా పట్లం భయం పెరుగుతోంది. బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్ ప్రకారం.. ప్రకారం చైనాలో ఒక్క రోజే 3.7 కోట్ల కేసులు నమోదయ్యాయని అంటున్నారు. దీనికి ఆధారాలు లేవు. ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. (ప్రతీకాత్మక చిత్రం - image credit - reuters)
బీజింగ్, చుట్టుపక్కల పట్టణాలు, దేశంలోని చిన్న నగరాల్లోని ఎమర్జెన్సీ వార్డులు, ఐసీయూలన్నీ కరోనా పేషెంట్లతో నిండిపోయాయి అని ప్రచారం జరుగతోంది. అక్కడికి వెళ్లి ఎవరూ చూసినట్లు ఆధారాలు లేవు. అయినా ఇలాంటి ప్రచారం మాత్రం తెరపైకి వస్తోంది. కరోనా సోకిన వాళ్లు బెడ్ కోసం వెతుక్కునే దుస్థితి ఉందని అంటున్నారు. నేలపైనే పడుకుంటున్నారని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలుగా చెబుతున్న వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నాయి. అవి నిజమైన వీడియోలేనా అనేది తెలియదు. (ప్రతీకాత్మక చిత్రం - image credit - reuters)
డిసెంబర్లో మొదటి 20 రోజుల్లో 24.8 కోట్ల మందికి కరోనా సోకిందనే అంచనా ఉంది. డిసెంబర్ 20న ఒక్కరోజే 3.7 కోట్ల కేసులు వచ్చాయి అంటున్నారు. ఆ రోజు చైనా అధికారిక లెక్క మాత్రం 3,049గా ఉంది. చైనా చెప్పే లెక్కలు నమ్మేలా లేవు. అలాగని ఈ భారీ లెక్కలు కూడా నమ్మేలా లేవు. కానీ ఇలాంటి వార్తలు ప్రజలకు సమస్యగా మారుతున్నాయి. లేనిపోని భయాలు పెంచుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం - image credit - reuters)
ఇండియా ఆల్రెడీ 3 దశల్లో కరోనాను ఎదుర్కొంది. మన దేశంలో వ్యాక్సినేషన్ కూడా బాగానే జరిగింది. చెప్పాలంటే చాలా మంది రెండు, మూడో డోస్‌లు వేసుకోలేదు. అవసరం లేదనే ఉద్దేశంతో ఆగిపోయారు. ఇప్పుడు మళ్లీ కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాలు అందరికీ డోసులు వేయించేందుకు రెడీ అవుతున్నాయి. చైనా కరోనా ప్రభావం ఇండియాపై అంతగా ఉండదని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే అంటున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఒకటి మాత్రం నిజం. అమెరికా, కొన్ని యూరప్ దేశాలు, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, థాయిలాండ్‌లో కరోనా కేసులు వస్తున్నాయి. ఈ దేశాల నుంచి ఇండియాకి వచ్చేవారు చాలా ఎక్కువ. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి మన్సుఖ్ మాండవియా.. రాష్ట్రాల మంత్రులతో మీటింగ్ పెట్టి.. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం RT-PCR టెస్టులను అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు తప్పనిసరి చేస్తూ శనివారం ఓ ప్రకటన జారీ చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
చైనా, జపాన్, దక్షిణకొరియా, హాంకాంగ్, థాయిలాండ్ నుంచి ఇండియా వచ్చే వారికి RT-PCR టెస్ట్ చేస్తున్నారు. ఒకవేళ టెస్టులో పాజిటివ్ అని తేలినా లేక లక్షణాలు కనిపించినా.. క్వారంటైన్లో ఉంచుతామని కేంద్రం తెలిపింది. అలాగే.. రాష్ట్రాలు, కేంద్రపాలితాల్లో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్, సిలిండర్లు, లైఫ్ సపోర్ట్ సామగ్రి, వెంటిలేటర్ల వంటివి రెడీగా ఉంచుకోవాలని కేంద్రం శనివారం తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
ముక్కు ద్వారా వేసుకునే భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ఇన్కోవాక్ (iNCOVACC) అందుబాటులోకి వచ్చింది. శనివారం సాయంత్రం నుంచి ఇది కోవిన్ (CoWin) యాప్‌లో లభిస్తోంది. ఐతే.. దీని ధర ఎంత అనేది కంపెనీ ఇంకా చెప్పలేదు. వచ్చేవారం ప్రకచించే అవకాశం ఉంది. కరోనాకి ఈ వ్యాక్సిన్ కూడా ఇచ్చేందుకు కేంద్రం శుక్రవారం ఆమోదం తెలిపింది. (image credit - twitter - @TimsyJaipuria)