ఈ ఫొటోలో కనిపించే వ్యక్తి పేరు మహర్. అప్ఘనిస్తాన్ లో ఒకప్పుడు బాదం తోటలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతంలో నివసిస్తున్నాడు, కానీ కరువు కారణంగా బాదం చెట్లు బాగా ఎండిపోయాయి. ఈ బాదం చెట్లే వారికి ప్రధాన ఆదాయ వనరు. కరువు వల్ల ఈ ప్రాంతంలో చాలా విధ్వంసం జరిగిందని, సుమారు ఒక ఎకరం వ్యవసాయ భూమి నాశనమైందని చెప్పారు. తనలాంటి ఎన్నో కుటుంబాలు ఇప్పుడు తిండి కోసం తహతహలాడుతున్నాయని మహర్ చెబుతున్నారు.
ది గార్డియన్లోని ఒక నివేదిక ప్రకారం.. మహర్ కుమారులలో ఒకరైన రహీమ్ తన తల్లిని పగలు, రాత్రి కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. వాస్తవానికి, రహీమ్ తల్లి, అతని సోదరుడు ఆసుపత్రిలో చేరారు, ఎందుకంటే కరువు కారణంగా వీరి కుటుంబం చాలా ఒత్తిడికి గురైంది. కొన్నిసార్లు గడ్డిని కూడా ఆహారంగా తినడం ప్రారంభించింది. అందుకే మహర్ భార్య, పెద్ద కొడుకు అనారోగ్యంతో ఉన్నారు. భార్య పేగులు దెబ్బతిన్నాయని డాక్టర్ చెప్పారు.
రహీమ్ తన చెల్లెలు వంట చేయడం చూస్తున్నాడు. ప్రస్తుతం వీరి కుటుంబం సహాయం పొందింది కాబట్టి ఇప్పుడు రెండుసార్లు భోజనం సులభంగా తయారు చేయబడుతుంది. గత ఆరు నెలల్లో, డిజాస్టర్ ఎమర్జెన్సీ కమిటీ (DEC).. దాదాపు 1.25 మిలియన్ల మందికి వారి అవసరాలను తీర్చడానికి డబ్బును అందించింది. వారికి ఆహారం, మందులు లేదా ఇంధనం కొనుగోలు చేసే స్వేచ్ఛను ఇచ్చింది. ప్రస్తుతం రోటీ తయారీకి కావలసిన పదార్థాలు తమ వద్ద ఉన్నాయని మహర్ చెప్పారు.
దేశవ్యాప్తంగా ఆహార ధరల పెరుగుదలకు కరువు దోహదపడింది. అయితే ఇది సమస్యలో ఒక భాగం మాత్రమే. అప్ఘానిస్తాన్ ఎల్లప్పుడూ దిగుమతి చేసుకున్న ధాన్యాలు, కూరగాయల నూనెపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఉక్రెయిన్లో యుద్ధం ప్రపంచ ఆహార ధరలలో పెరుగుదలకు కారణమైంది, దీనివల్ల దిగుమతి చేసుకున్న గోధుమల ధరలు గణనీయంగా పెరిగాయి.
ఈ చిన్నారి ఫర్హాన్ చిన్న కూతురు హుస్నా. స్థానిక స్వచ్ఛంద సంస్థల ద్వారా పంపిణీ చేయబడిన నగదు సహాయంపై వీరి కుటుంబం ఆధారపడి ఉంటుంది. నగదు వచ్చినప్పటి నుంచి నా పిల్లలకు మంచి బట్టలు, ఆహారం అందించగలుగుతున్నాను అని ఫర్హానా చెప్పింది. మేము కొనుగోలు చేసే ఆహారం వారికి విజయవంతమైన జీవితాన్ని గడపడానికి తగినంత శక్తిని ఇస్తుందని నేను ఆశిస్తున్నాను అని ఫర్హాన్ చెప్పింది.
ఈ ఫొటోలో కనిపిస్తున్న 17 ఏళ్ల మొహమ్మద్ తమ్ముళ్లతో సహా ఆఫ్ఘనిస్తాన్ అంతటా లక్షలాది మంది పిల్లల చదువులు దెబ్బతిన్నాయి. మొహమ్మద్ తండ్రి గత సంవత్సరం క్యాన్సర్తో మరణించాడు. మొహమ్మద్ తన తల్లి, ఎనిమిది మంది సోదర సోదరీమణులకు బాధ్యత వహిస్తున్నాడు. అతను రోజులో సంపాదించే డబ్బు తిండికి సరిపోదు, కాబట్టి చదువు కష్టం.