Afghanistan: కాబూల్ ఎయిర్‌పోర్టులో 40 మంది మృతి.. ఆప్ఘాన్‌లో అసలేం జరుగుతోంది...?

Afghanistan: తాలిబన్ల పాలనలో అప్ఘానిస్తాన్ అట్టుడుకుతోంది. అక్కడి ప్రజలు ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటూ బతకుతున్నారు. చాలా మంది దేశం విడిచి పారిపోయేందుకు యత్నిస్తున్నారు. సోమవారం కాబూల్ ఎయిర్ పోర్టులో పరిస్థితి ఎలా ఉందో... ఇప్పటికే పలు వీడియోల ద్వారా ప్రపంచానికి తెలిసింది.