చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచమంతా వ్యాపించి అంతమైనా.. డ్రాగన్ దేశంలో మాత్రం విజృంభిస్తూనే ఉంది. ఈమధ్య ప్రజల ఆందోళనలను లెక్కలోకి తీసుకొని.. పాలకులు.. కఠిన ఆంక్షల్ని సవరించారు. అంతే.. కరోనా ఒక్కసారిగా పెరిగిపోయింది. పరిస్థితి ఎలా ఉందంటే.. 2023 నాటికి చైనాలో కరోనా వల్ల 10 లక్షల మందికి పైగా చనిపోయే ప్రమాదం ఉందని అమెరికాకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవల్యూషన్ (IHME) అంచనా వేసింది. (image credit - reuters)
చైనా నిర్ణయంపై ప్రపంచ దేశాలు మండిపడుతున్నాయి. ఆంక్షల్ని ఎడాపెడా ఎత్తేయడం వల్లే కేసులు భారీగా పెరిగిపోతున్నాయని ఆరోపిస్తున్నాయి. ఇవే దేశాలు మొన్నటిదాకా ఆంక్షలు ఎత్తేయాలని డిమాండ్ చేశాయి. తీరే ఎత్తేశాక.. మరో రకమైన వాదన తెరపైకి తెచ్చాయి. ఏమైతేనేం.. చైనాలో మాత్రం కరోనా తగ్గట్లేదు. (image credit - reuters)
చైనా డిసెంబర్లో ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత ఎంత మంది చనిపోయిందీ చైనా చెప్పలేదు. చివరిసారిగా డిసెంబర్ 3న మరణాల వివరాలు చెప్పింది. చైనాలో 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. వారిలో చాలా మంది కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొంటారు. అందువల్ల జనవరిలో కేసులు బాగా పెరుగుతాయనే అంచనా ఉంది. (image credit - reuters)
నిజానికి జీరో కోవిడ్ పాలసీ ద్వారా చైనా.. కరోనాను అత్యంత సమర్థంగా ఎదుర్కోగలిగింది. కానీ వేగంగా వ్యాపించే ఒమైక్రాన్ వేరియంట్ విషయంలో మాత్రం డ్రాగన్ అంచనాలు తప్పాయి. ఆ వేరియంట్.. ఆంక్షల్ని దాటి మరీ వ్యాపించింది. ఫలితంగానే ఈ పరిస్థితి వచ్చింది. దానికి తోడు ప్రజలు కూడా రెండేళ్లుగా ఆంక్షలను భరించి.. విసుగెత్తిపోయి.. ఆందోళనలకు దిగారు. దాంతో ఆంక్షలు సడలించాల్సి వచ్చింది. ఫలితంగా కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. (image credit - reuters)
ఒమైక్రాన్ వేరియంట్ ఇండియాలో కూడా కొంత ప్రభావం చూపినా.. భారతీయులు దాన్ని విజయవంతంగా ఎదుర్కోగలిగారు. భారత్లోని వేడి వాతావరణం ఆ వైరస్ ఎక్కువగా వ్యాపించకుండా అడ్డుకోగలిగింది. చైనాలో చల్లటి వాతావరణం వల్ల కరోనా కంట్రోల్ కావట్లేదు. ఇది మళ్లీ ప్రపంచ దేశాలకు వ్యాపించకుండా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. (image credit - reuters)