కన్యాశుల్కం, బాల్య వివాహాల కాలంలో.. చిన్న వయసు అమ్మాయిలను ముసలి వాళ్లకు ఇచ్చి పెళ్లి చేసేవాళ్లు. డబ్బున్న ముసలివాళ్లు బలవంతంగా పెళ్లి చేసుకునేవాళ్లు. క్రమంగా ఇలాంటి వాటిని సమాజం వ్యతిరేకిస్తూ వచ్చింది. మరి ఇప్పుడీ పెళ్లి ఎలా జరిగింది? ప్రేమ గుడ్డిదే కావచ్చు. సమాజం కాదు కదా. కానీ పాకిస్థాన్ సమాజం సమ్మతించింది. 70 ఏళ్ల ముసలాయన.. 19 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకునేందుకు అక్కడ ఎవరూ అభ్యంతరం చెప్పలేదు.
పాకిస్థాన్‌లో సయ్యద్ బాసిత్ అలీ అనే యూట్యూబర్.. ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉన్న దంపతుల వీడియోలు చేస్తుంటారు. అక్కడి వారు ఆ వీడియోలను బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు. ఫలితంగా బాసిత్‌కి వేలల్లో సబ్స్క్రైబర్లు ఉన్నారు. తాజాగా 70 ఏళ్ల పాకిస్థాన్ బాబా, 19 ఏళ్ల అమ్మాయిని పెళ్లాడిన స్టోరీని వీడియో ద్వారా చూపించాడు. ఇందులో షుమైలా ఇష్టపడి అతన్ని పెళ్లి చేసుకుంది. తాత వయసు ఉన్న బాబాకి మనసు మాత్రం యంగే అంటోంది ఆమె.
లియాఖత్ అలీ (70).. షుమైలా అలీ (19)ని లాహోర్‌లో ఓ రోజు మార్నింగ్ వాక్‌లో చూశాడు. తొలి చూపులోనే ఆమెను ప్రేమించిన అలీ.. ఇంప్రెస్ చెయ్యడానికి ఏదైనా చెయ్యాలి అనుకున్నాడు. తర్వాతి రోజు ఆమెను ఫాలో అవుతూ పాట పాడాడు. అది ఆమెకు నచ్చింది. దాంతో ఇద్దరూ రోజూ వాకింగ్ చేస్తూ.. పరిచయం పెంచుకున్నారు. అలా ఇద్దరి మధ్యా ప్రేమ పుట్టింది. అది పెళ్లికి దారితీసిందని తెలిపారు.
ఇండియాలో మాగ్జిమం పదేళ్ల గ్యాప్ మించకుండా పెళ్లిళ్లు చేస్తున్నారు. పాకిస్థాన్‌లో వీళ్లిద్దరి మధ్యా ఏజ్ గ్యాప్ 49 ఏళ్లు ఉంది. ఇతన్ని ఎలా చేసుకున్నావ్ అని ఆమెను అడిగితే.. "ప్రేమకు వయసు లేదు. అది అలా పుడుతుందంతే" అని తెలిపింది. ఈ పెళ్లిని మొదట్లో తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కానీ షుమైలా పట్టుదల చూసి.. చివరకు సరే అన్నారట. ఇద్దరం కలిసి కన్వీన్స్ చేశాం అని షుమైలా తెలిపింది.