Egypt : ఈజిఫ్టులో తవ్వకాలు జరుపుతున్నకొద్దీ పాత మమ్మీలు కొత్తగా బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా లక్సోర్ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో చెక్క పెట్టెల్లో భద్రపరిచిన 30 మమ్మీలు బయటపడ్డాయి. అవి 3వేల ఏళ్లనాటివని తేలింది. (credit - insta - Ministry of Antiquities-Arab Republic of Egypt)
నైలూ నదికి ఎడమ ఒడ్డున ఉంటుంది లక్సోర్. అక్కడి అసాసిఫ్ నెక్రోపోలీస్ ప్రాంతంలో ఈ మమ్మీ శవాలు, వాటి పేటికలు బయటపడ్డాయి. గత వందేళ్లలో ఇంత భారీ సంఖ్యలో మమ్మీలు దొరకడం ఇదే మొదటిసారి అంటున్నారు అధికారులు. (credit - insta - Ministry of Antiquities-Arab Republic of Egypt)
మొస్తాఫా వాజీరీ నేతృత్వంలోని టీమ్ తవ్వకాలు జరపగా... మొత్తం రెండు వరుసల్లో 18 మమ్మీ శవపేటికలు దొరికాయి. ఆ తర్వాత మరో 12 శవాల పేటికలు అంతంతమాత్రంగా ఉన్నవి కనిపించాయి. (credit - insta - Ministry of Antiquities-Arab Republic of Egypt)
దొరికిన మమ్మీల్లో 23 మంది మగాళ్లు, ఐదుగురు మహిళలున్నారు. ఇద్దరు పిల్లలున్నారు. (credit - insta - Ministry of Antiquities-Arab Republic of Egypt)
క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాలప్పుడు 22వ ఫారో రాజు పరిపాలన ఉండేది. ఆయన కాలంలోనే వీళ్లంతా చనిపోయినట్లు తెలిసింది. (credit - insta - Ministry of Antiquities-Arab Republic of Egypt)
ఓ మగ శవ పేటిక, ఓ మహిళ శవ పేటిక తెరిచి ఉన్నాయి. రెండింటినీ చక్కగా క్లాత్‌లో కట్టి భద్రపరిచారు. (credit - insta - Ministry of Antiquities-Arab Republic of Egypt)
వాళ్ల చేతుల్ని ఉంచిన విధానాన్ని బట్టీ... ఆడ, మగ అన్నది తెలిసింది. మగవాళ్లు చనిపోతే చేతుల్ని మూసివేసి మమ్మీగా మార్చుతారు. అదే ఆడవాళ్లు చనిపోతే... చేతుల్ని ఓపెన్‌గా ఉంచి మమ్మీగా చేస్తారు. (credit - insta - Ministry of Antiquities-Arab Republic of Egypt)
ఈ శవాలపై మరిన్ని పరిశోధనలు చెయ్యనున్నారు. ఆ తర్వాత వాటిని గ్రాండ్ ఈజిఫ్షియన్ మ్యూజియం దగ్గరున్న షోరూంకి తరలిస్తారు. (credit - insta - Ministry of Antiquities-Arab Republic of Egypt)
ఆ షోరూం గిజా పిరమిడ్స్‌కి పక్కనే ఉంటుంది. దాన్ని వచ్చే సంవత్సరం సందర్శకుల కోసం ఓపెన్ చెయ్యనున్నారు. అంటే ఈ మమ్మీలను టూరిస్టులంతా కళ్లారా చూసే వీలుంటుంది. (credit - insta - Ministry of Antiquities-Arab Republic of Egypt)