అది 2001 సెప్టెంబర్ 11.. ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై అల్‌ఖైదా పక్కా వ్యుహంతో జరిపిన ఉగ్రదాడి.. జనాలను భయకంపితులను చేసింది. ఇది చరిత్రలో ఉగ్రవాదులు జరిపిన అతిపెద్ద దాడిగా నిలిచింది. దాదాపు 3వేల మందిని ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో తీవ్రంగా స్పందించిన అమెరికా.. ఈ దాడుల వెనక ఉగ్రమూకలను మట్టుబెట్టడమే లక్ష్యంగా అఫ్గానిస్తాన్‌లో కాలుమోపింది. రేపటితో 9/11 మరణహోమానికి రేపటితో 20 ఏళ్లు పూర్తి కానున్న వేళ.. ఈ కాలంలో జరిగిన కీలక పరిణామాలను ఒకసారి చూద్దాం..