మీరు హర్రర్ సినిమాల్లో చూసే ఉంటారు. ఊజా బోర్డ్ (Ouija board) ఆడినప్పుడు.. దెయ్యాలు వచ్చి.. స్పందిస్తాయి. తామెవరు, ఏం కోరుకుంటున్నదీ చెబుతాయి. సినిమాల వరకూ ఇది ఓకే గానీ.. శాస్త్రీయంగా ఇలాంటివి రుజువు కాలేదు. విదేశీయుల్లో చాలా మంది ఊజా బోర్డును నమ్ముతారు. అలా నమ్మిన విద్యార్థులే వారంతా. (ప్రతీకాత్మక చిత్రం)
కొలంబియాలో ఈ ఘటన జరిగింది. అక్కడి అగ్రికల్చరల్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్కి చెందిన 11 మంది విద్యార్థులు.. ఊజా బోర్డ్ ఆడిన తర్వాత.. స్కూల్ కారిడార్లో చెల్లా చెదురుగా పడిపోయారు. స్పృహతప్పిన వారిలో కొందరికి వాంతులవగా.. మరికొందరికి కడుపు నొప్పి వచ్చింది. కండరాలు పట్టేసినట్లు అయ్యింది. వెంటనే వారిని మాన్యులా బెల్ట్రాన్ ఆస్పత్రికి తరలించారు. పడిపోయిన వారి వయసు 13 నుంచి 17 ఏళ్ల మధ్య ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
విద్యార్థులను పరీక్షించిన డాక్టర్లు.. వారికి ఫుడ్ పాయిజన్ అయ్యిందని చెప్పారు. ప్రస్తుతం అందరూ బాగానే ఉన్నారని తెలిపారు. స్కూల్ యాజమాన్యం వాదన మరోలా ఉంది. ఓ దెయ్యంతో మాట్లాడేందుకు ఆ విద్యార్థులు యత్నించారనీ.. అందువల్లే ఇలా జరిగిందా అనే అంశాన్ని కొట్టిపారేయలేమని అన్నారు. ఈ కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
పిల్లలు స్పృహతప్పి పడిపోయినప్పుడు వారిలో కొందరికి శ్వాస సరిగా ఆడలేదు. మరికొందరికి నోటి నుంచి నురగలు వచ్చాయని తెలిసింది అని మేయర్ తెలిపారు. ఐతే.. విద్యార్థులు తాగిన నీరు కలుషితమైనది కావడం వల్ల ఇలా అయ్యిందని కొందరు అంటుంటే... వారు ఏం తిన్నారో దానిపై దర్యాప్తు జరపాలని మరికొందరు అంటున్నారు, (ప్రతీకాత్మక చిత్రం)
ఊజా బోర్డులో నంబర్లు, ఇంగ్లీష్ అక్షరాలూ ఉంటాయి. ఎస్, నో, హెలో, గుడ్ బై వంటి పదాలుంటాయి. దీన్ని ఆడేవారు.. బోర్డుపై గుండె ఆకారంలో ఉండే కలప వస్తువు ప్లాన్చెట్టేను ఉంచి.. దానిపై చేతి వేళ్లను ఉంచుతారు. ప్లాన్చెట్టే ఎటువైపు కదులుతుందో గమనించి.. దానిని బట్టీ.. దెయ్యం ఏం చెప్పాలనుకుంటుందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ బోర్డుకి శాస్త్రీయ ఆధారాలు లేవు. దెయ్యమే ప్లాన్చెట్టేను కదుపుతోందనేందుకు కూడా ఆధారాలు లేవు. ఈ ఆట ఆడేవారు.. కావాలనే ప్లాన్చెట్టేను కదుపుతారు. తద్వారా దెయ్యమే అలా చెయ్యి్స్తోందని నమ్ముతారు. ఎందుకంటే వారు అలా జరగాలని కోరుకుంటారు. అంతే తప్ప ఏ దెయ్యమూ లేదని నిపుణులు చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)