"నాజర్ బొంకుగు", లేదా టర్కిష్‌లో "చెడు కన్ను",కరిగిన గాజు, ఇనుము, రాగితో చేసిన రాయి. 3000 సంవత్సరాల నాటి సంప్రదాయం ప్రకారం దుష్ట శక్తులను పారద్రోలేందుకు దీనిని ధరిస్తారు. నెగటివ్ ఎనర్జీ నుండి రక్షించే శక్తి బ్లూ స్టోన్‌కు ఉందని నమ్ముతారు. టర్కీకి వచ్చే ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.